ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ‘బాహుబలి’ సినిమాకి సంబంధించి ఒక్కో లుక్‌నీ విడుదల చేస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాడు. ప్రభాస్, అనుష్క, రాణా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘బాహుబలి’ రెండు పార్టుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. తొలి పార్ట్ అతి త్వరలో విడుదల కానుంది.
ఇక, సినిమాకి సంబంధించి లెక్కకు మిక్కిలిగా ‘లుక్స్’ని విడుదల చేస్తున్నాడు రాజమౌళి. ఆ కోవలో తాజా లుక్ కన్నడ హీరో సుదీప్‌ది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమాలో కామెడీ పండిస్తూనే, పవర్‌ఫుల్ విలనిజం పండిరచిన సుదీప్, కన్నడలో బిగ్ స్టార్. ‘బాహుబలి’ సినిమా కోసం రాజమౌళి రిక్వెస్ట్ మేరకు అతిథి పాత్రలో నటించాడట సుదీప్. ఈ విషయాన్ని ‘బాహుబలి’లో సుదీప్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తూ ట్విట్టర్‌లో ప్రస్తావించాడు రాజమౌళి.
‘బాహుబలి’లో సుదీప్ పాత్ర పేరు అస్లాం ఖాన్ అట. ఇప్పటికే ‘బాహుబలి’కి సంబంధించిన ప్రధాన తారాగణాన్ని పరిచయం చేస్తూ కొన్ని ‘లుక్స్’ని రాజమౌళి విడుదల చేసిన విషయం విదితమే. దేనికదే హైలైట్ అని ‘లుక్స్’తోనే ఆడియన్స్ అనుకునేలా చేసిన రాజమౌళి, ‘బాహుబలి’ని ఎలా తెరకెక్కించాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.