చానెళ్లకు ప్రకటనల విషయంలో కౌన్సిల్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. ఇప్పటికి అప్రూవ్ చేసిన నాలుగు చానెళ్లకు తోడుగా మరో నాలుగు చానెళ్లకు కూడా ప్రకటనలు ఇవ్వాలని అనుకున్నారు. ఆ మేరకు చర్చలు సాగాయి. లేఖలుచేతులు మారాయి. నిర్ణయం తీసుకున్నారు. ఇక అధికారికంగా కౌన్సిల్ లేఖ లు పంపడమే మిగిలింది.ఈ నాలుగు చానెళ్లు కలిస్తే, మొత్తం ఎనిమిది చానెళ్లకు ప్రకటనల పానెల్ లో చోటు దొరుకుతుంది.
ఆ తరువాత మరో రెండు చానెళ్లకు చోట్వివ్వాలన్న ఆలోచనకూడా వుంది. అయితే ముందు ఈ అదనపు నాలుగు చానెళ్లకే ఇంకా లేఖలు వెళ్లలేదట. దానికోసం చానెళ్లు ఎదరు చూస్తున్నాయి. ప్రకటనల నేపథ్యంలో వరుసపెట్టి కథనాలు ప్రచురించిన పత్రికలు అలసిపోయినట్లున్నాయి. మరి రాయడం మానేసాయి. కధనాలు కంటిన్యూగా రాయడం వుండకపోవచ్చు. కానీ ఆ వేడిలో ఎప్పుడూ లేనిది సమీక్షలు కూడా ప్రచురించడం ప్రారంభించేసాయి.
ఈ కోపం అంతా మరి కోపమో, మరేమిటో కానీ, ఇంతలోనే మళ్లీ ఆపేసాయి. అంటే లేఖలు ఇస్తారని వార్తలు వినవస్తున్న నేపథ్యంలో ఆపేసారా అన్నది అనుమానం. అలా అయితే పాఠకులకు నికార్సయిన సమాచారం చేరవేయడం ఎలా అవుతుంది. తమకు ఇష్టమైతే నికార్సయిన సమీక్షలు ఇస్తాం. లేదంటే మానేస్తాం అనేదాన్ని ఎలా అర్థం చేసకోవాలి.
మొత్తానికి ఇప్పుడ కౌన్సిల్ లేఖల కోసం నాలుగు చానెళ్లు ఎదురుచూస్తున్నాయి. ఇంతకీ ఆ జాబితాలో తమ చానెల్ పేరు వుందా లేదా అని కిందా మీదా పడుతున్నాయి కూడా.