పూరీ బతకలేనితనం

పూరీ జగన్నాథ్‌ ఉవాచ – Advertisement ''ఆడది లేనిదే మగాడు బతకలేడు … మగాడు లేనిదే ఆడది బతకలేదు … అలాగని ఇద్దరూ కలసి అసలు బతకలేరు''. 'సెక్సిస్ట్‌'గా ముద్రపడ్డ కఐకుడు, దర్శకుడు పూరీ…

పూరీ జగన్నాథ్‌ ఉవాచ –

''ఆడది లేనిదే మగాడు బతకలేడు …
మగాడు లేనిదే ఆడది బతకలేదు …
అలాగని ఇద్దరూ కలసి అసలు బతకలేరు''.
'సెక్సిస్ట్‌'గా ముద్రపడ్డ కఐకుడు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ లేటెస్ట్‌ పర్సనల్‌ ఒపీనియన్‌ ఇది.
''ఫ్రెండ్స్‌గా ఉండగలిగితేనే పెళ్లి చేసుకోవాలి'' అన్నది పూరీ స్టేట్‌మెంట్‌.
పైగా ''వివాహం అనేది త్వరలో అదృశ్యం అవుతుంది'' అన్నది పూరీ కాలజ్ఞానం.

ఇవన్నీ పూరీ జగన్నాథ్‌ ఏ సినిమా కోసమో రాసుకున్న డైలాగ్స్‌ కావు. తన జీవితాన్ని, తన చుట్టుపక్కలవారి జీవితాల్ని వాటికి కొంచెం సామాజికుల తిరగమోత దట్టించి ప్రయోగించిన హిరోషిమా బాంబుకు ఏవిధంగాను తీసిపోని అణుబాంబులివి.

మాట చిన్నదే అయినా ఆ మాటల వల్ల అపారనష్టం అని తెలిసినా తమ అస్తిత్వం కోసమే ఈ బాంబులను ప్రయోగిస్తూ తమకేవిూ నష్టం లేదని అనుకోవచ్చు కానీ ఆ విషవాయువులు తమవైపూ వీయకపోవు … తామూ ఉక్కిరి బిక్కిరి కాక తప్పదు.

మొత్తానికి పాయింట్‌ ఒక్క శాతమే వాస్తవం అనిపిస్తున్పప్పటికీ దీన్ని చూసి గడగడలాడాల్సిన పరిస్థితి దాపురించటం లేదు … ఈ విషయాన్ని అవేర్‌నెస్‌ పేరిట ఇంజెక్ట్‌ చేయాల్సిన అవసరమూ కనిపించటం లేదు. ఒక్కోసారి ఇవి మంచి చేస్తాయో, చెడు చేస్తాయో అర్థం కాని పరిస్థితి. నష్టమే ఎక్కువ అనుకున్నపుడు కాంట్రవర్షియల్‌ అవుతుంటాయి.

ఆడది లేనిదే మగాడు బతకలేడా?

సంజయ్‌ కల –

ఉదయాన్నే నిద్రలేచేప్పటికి ఎదురుగా అమ్మ ఉండదు … భార్య ఉండదు … ఇంట్లో ఒక్క ఆడపురుగూ కనిపించదు – ఓ మైగాడ్‌!

డ్రైవ్‌ చేసుకుంటూ ఆఫీస్‌కి వెళ్తుంటే రోడ్లపైన ఎక్కడ చూసినా మగవాళ్లే … కళ్లు అప్పగించి చూడాలనిపించదు – డామిట్‌, ఎందుకు ఆఫీస్‌కు వెళ్తున్నట్లు?

ఆఫీస్‌లోకి అడుగు పెడుతుంటే నవ్వుతూ పలకరించే రిసెప్షనిస్ట్‌ ఏదీ … పైగా ఆ స్థానంలో వెకిలి నవ్వుతో ఒక మగాడు – ఛీ. ఎందుకీ బతుకు!

ఆఫీస్‌లో ఎటుచూసినా చిరాకు చిరాకుగా అందరూ మగ మహారాజులే … అయినా ఆడవారే లేని ఆఫీసులో మగవాళ్లు మహారాజు లవుతారా? – అన్నీ చెత్త మొహాలే?

కాఫీ బ్రేక్‌లోనో, లంచ్‌ బ్రేక్‌లోనో కంపెనీ ఇచ్చేందుకు ఒక్క అపోజిట్‌ జెండర్‌ కనిపించదే … అట్రాక్టివ్‌గా కబుర్లు చెప్పే ఆడవాళ్లు చెంతన లేకపోతే … లైఫ్‌ ఈజ్‌ బోరింగ్‌!

సాయంత్రం ఏ మాల్‌ కో, ఏ పార్క్‌కో వెళ్తే ఎక్కడా ఒక్క రొమాంటిక్‌ ఫేసూ కనిపించదు … ఎటుచూసినా బాయ్సే తప్ప గర్ల్‌ ఫ్రెండ్స్‌ కనిపించరు – ఈ బతుకు బతికే బదులు చస్తే బెటర్‌.

పోనీ సినిమాకి వెళ్తే అందులోనూ అందరూ మగ వెధవలే … ఒక్క రొమాంటిక్‌ సాంగ్‌ లేదు … ఒక్క ఐటమ్‌ సాంగ్‌ లేదు … ఏ ఒక్క ఎక్స్‌పోజింగ్‌లూ లేని సినిమా చూడటం ఎందుకు?

ఆడవారుంటేనే ప్రపంచం సీతాకోక చిలుకల విహార మవుతుంది … లేకుంటే మగవారితో ప్రపంచమంతా గొంగళి పురుగుల సామ్రాజ్య మవుతుంది.

గొంగళిపురుగులు విూద విూదకు పాకుతున్నట్లనిపించి ఒళ్లు జలదరించింది సంజయ్‌కు … కల చెదిరింది … 'Women make our Life easy and meaningful. They add love to our lives. I can't imagine  a day without them in any form' అనుకుంటూ బెడ్‌ దిగాడు సంజయ్‌.

బ్రష్‌ చేసుకుంటుంటే అనిపించింది పెళ్లి చేసుకోని అబ్దుల్‌ కలాం అయినా, అటల్‌ బిహారి వాజ్‌పాయ్‌ అయినా,  పెళ్లి చేసుకునీ ఒంటరిగా జీవితం గడుపుతున్న నరేంద్ర మోడీ అయినా ఆ మాత్రం నవ్వుతూ ఉండగలుగుతున్నారంటే కనీసం నవ్వుతూ కనువిందు చేసే ఆడ ప్రపంచం చుట్టూ ఉంది కాబట్టి.

నకుల్‌ ఉవాచ –

ప్రపంచానికి 24 గంటలు బదులు 12 గంటలే ఒకరోజు అవుతుంది. భూమి ఇప్పటిలా ఒక్కసారి కాక రెండు మార్లు గుండ్రంగా తిరుగుతుంది. స్త్రీలు లేకపోతే రొమాన్స్‌ ఉండదు … గాసిప్స్‌ ఉండవు … సెక్స్‌పై మోజు ఉండదు … సిక్స్‌పాక్‌ల అవసరం ఉండదు … అసలు సెక్స్‌కి అర్థమే ఉండదు.

మగాడు లేనిదే ఆడది బతకలేదా?

శ్రీజ ఉవాచ –

స్త్రీకి పురుషుడు ఎంత అవసరమో మగాడికి ఆడదీ అంతే అవసరం. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిందే! కేవలం సెక్స్‌ కోసమే భార్యాభర్తల బంధం కాదు. పిల్లల్ని కనటానికే పెళ్లాం కాదు. స్పెర్మ్‌తో ఒక బేబీని కనేయొచ్చు, కాబట్టి పిల్లల కోసమే సంసారబంధం అనటం సమ్మతించదగ్గ విషయం కాదు. అలాగే స్త్రీలు కూడా పురుషుల్ని సంతానోత్పత్తి ఉపకరణాలుగా చూడకూడదు. భార్యాభర్తల బంధం అద్వితీయ బంధం. ఆ బంధంతోనే ఒకరు లేనిదే మరొకరు ఉండలేకపోవటం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న ప్రశ్నే లేదు.

పద్మజ ఉవాచ –

A woman can't live without a man … అలాగే man needs a woman. Love is needed to live a wonderful and perfect life.

ఇద్దరూ కలిసి అసలు బతకలేరా?!

మంజుల ఉవాచ –

పూరీ అన్నంత మాత్రాన భార్యాభర్తలిద్దరూ కలిసి జీవించలేకపోవటం అన్నది మన సమాజంలో పాయింట్‌ ఒన్‌ పర్సెంట్‌ కూడా లేదు. అది ఇప్పుడిప్పుడే విత్తనంగా భూమిని చేరుకుంటోంది … అది మొక్క అవ్వాలి … మాను అవ్వాలి. ఇన్ని వేల సంవత్సరాల సంస్కృతిలో ఇప్పుడు పలికిన అపశ్రుతి ఇది. దీనికోసం బెంబేలెత్తిపోయి మిన్ను విరిగి విూద పడ్డట్టు భయపడట మెందుకు? పూరీలాంటి దర్శకులు సమాజాన్ని భయపెట్టట మెందుకు? ఒంటరిగా సర్వైవ్‌ కావటం  పెద్ద కష్టమైన విషయం కాదు. అయితే అలా బ్రతకటం అసంపూర్ణ జీవితం అవుతుంది.

గౌరి ఉవాచ –

స్త్రీ అయినా పురుషుడయినా మనిషే కదా! మనిషికి మానసిక అవసరాలు, శారీరక అవసరాలు ఉంటాయి. దప్పిక వేసినప్పుడు నీళ్లు తాగటం ఎంత సహజమో స్త్రీ పురుషులకు సెక్స్‌ కూడా అంతే అవసరం. అది ఫ్రెండ్‌షిప్‌లో కావొచ్చు, కంపానియన్‌షిప్‌లో కావొచ్చు, మారేజ్‌లైఫ్‌లో కావొచ్చు. అపోజిట్‌ జెండర్‌ ఎట్రాక్షన్‌ సృష్టి ధర్మంలోనే ఉంది. కలిసి మనసులను, శరీరాలను పంచుకోలేనపుడు అన్‌హాపినెస్‌, లోన్లినెస్‌, ఫ్రస్ట్రేషన్‌లు తప్పవు. చాలమంది అనుకుంటారు సెక్స్‌ జీవితం లేనిదే బ్రతకలేమా అని. బ్రతకొచ్చేమో కానీ ఆ జీవితం ఇన్‌కంప్లీట్‌ లైఫ్‌ అనే కదా!

డా. సంతోష్‌ ఉవాచ –

స్త్రీ పురుషుల్ని విడివిడిగా చూస్తే, ఇండివిడ్యుయల్‌గా చూస్తే కంపానియన్‌షిప్‌ లేదా మారేజ్‌ లైఫ్‌ అనేది బయోలాజికల్‌ డిజైర్‌ అనే  అనిపిస్తుంది. నిజానికి అది బ్రతకటానికి కంపల్సరీ కాదు. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే కలెక్టిల్లీ వుయ్‌ ఆబ్వియవ్లీ రిక్వైర్‌ బోత్‌ సెక్సెస్‌ టు కంటిన్యూ ది స్పిసీస్‌.

జోసెఫ్‌ మేరీల ఉవాచ –

No one is greater than the other. Man and woman compliment each other in their life. It is incomplete for either of them without the other.

'సై'కాలజీ

సంసారం అంటే సాగరం కాదు కానీ ఒక రన్నింగ్‌ రేస్‌. ఇందులో భార్యాభర్తలిద్దరూ సమఉజ్జీలే. అసలు రేస్‌ వీరిద్దరి మధ్యనే … తక్కిన కుటుంబ సభ్యులు అంటే పేరెంట్స్‌, పిల్లలు, తోబుట్టువులు జస్ట్‌ పరిగెడుతున్నప్పటికీ విన్నర్‌, రన్నర్‌ అయ్యే అవకాశం లేనివారే! అంటే భార్యాభర్తల్లో ఒకరు విన్నర్‌ అయితే మరొకరు రన్నర్‌. జీవితాంతం ఇలా భార్యాభర్తలు మాత్రమే విన్నర్‌, రన్నర్‌ అవుతుండాలి. ఒకరికి ఒకరు ఇన్‌స్పిరేషన్‌, మోటివేషన్‌, కాంపిటీషన్‌. ఒక్కో సందర్భంలో ఒక్కరిదే పైచేయి అయినా కౌటుంబికంగా ఒకరు విన్నర్‌ అయినా, ఇంకొకరు రన్నర్‌ అయినా గెలుపు మాత్రం ఇద్దరిదీ … టీమ్‌ ఎఫెక్ట్‌తో. ఇలా మోటివేట్‌ అయితే ఇద్దరూ అసలు బతకలేకపోవటం అన్నది ఉండదు. బతికే తీరతారు … పైగా ఇతర దంపతుల్నీ బతికిస్తారు.

సమాజాన్ని బాగా చదవగలిగాడు కాబట్టే పూరీ ఇలా అన్నాడా? 'అవును' అన్నది సమాధానం అయితే ఏ సమాజం అన్నది ప్రశ్న. స్త్రీ పురుషులిద్దరూ భార్యాభర్తలుగా ఇకముందు బతికి బట్ట కట్టలేరన్నది ఈ కథకుడి దర్శకత్వ ప్రతిభ. 'ఎందుకట' అంటే ఆడింది ఆటగా పాడింది పాటగా జీవించలేకపోవటం అన్నది ఒక సమాధానంగా చెప్పుకుంటే, స్వేచ్ఛ లేకపోవటం ఇంకొక సమాధానం. డిపెండెంట్‌గా ఉండడం సాధ్యం కాదు అన్నది మరొక సమాధానం.

రానురాను విడిపోవటాలు ఎక్కువవుతున్నాయి … విడిపోయి వొంటరిగా జీవితం గడిపేయాలనుకోవటం పెరుగుతోంది. అంతమాత్రాన కొన్ని వేల ఏండ్లుగా నిలదొక్కుకున్న వివాహ వ్యవస్థ కనుమరుగవటం కనుచూపు మేరలో సాధ్యం కాదు. మరి కాలచక్రంలో వివాహాలే లేని వ్యవస్థ పూరీకి ఎక్కడ దర్శనీయమైందో?! కేవలం ఫ్రెండ్‌షిప్‌, కంపానియన్‌షిప్‌ ముడిపెడితే చాలు కలిసి జీవించేయొచ్చు అన్నది సిక్త్స్‌సెన్స్‌కి అందిన సవిూప భవిష్య చిత్రం కాబోలు.

అంతెందుకు పూరీ జగన్నాథ్‌ ఎంతమంది ప్రసిద్ధ సినీ జీవుల వైవాహిక వైభోగాన్ని చూడటం లేదూ … సినీ జగతిలో అయిదు థాబ్దాలుగా వైవాహిక జీవితం గడుపుతున్న వారినీ చూస్తున్నాం … మరి పూరీ జగన్నాథ్‌ వీరి కథల మధ్య ఎటువంటి ఐటమ్‌ సాంగ్స్‌ పెట్టి అభిమానులకి కిక్కెక్కించే వాడో … డైలాగ్‌లతో పాటు జీవితాల్నీ పేల్చేవాడో – కధామత్తులో.

సంసారం ఒక మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ … ప్రతీ కాన్సర్ట్‌కి ముందు సెట్‌ చేసుకోవలసిందే … అప్పుడే సుస్వరాలు పల్లవిస్తాయి … దాంపత్యబంధమూ అంతే … భార్యాభర్తలు, పిల్లలు, పేరెంట్స్‌ స్వరసంగమాలే. ఎప్పటికప్పుడు సరిచేసుకుంటుంటేనే సంసారం సుఖాంత మయ్యేది.

ఈనాటి వృద్ధజంటల్ని పలకరించండి – వారు చెప్పే సమాధానాలు పూరీ జగన్నాథ్‌ చెప్పే కారణాలకంటే ఎన్నో ఉన్నతంగా ఉంటాయి-

77 ఏళ్ల శివరావ్‌

వివాహం స్త్రీ పురుషులకి ఎంతో మానసిక ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది.

వివాహం ఎమోషనల్‌ లైఫ్‌కి, రెస్పాన్సిబుల్‌ లైఫ్‌కి పరమౌషధం.

65 ఏళ్ల సుశీలమ్మ

వివాహం వయసును కప్పి పుచ్చుతుంది.

ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి వివాహ వ్యవస్థనే అన్నివిధాల ఆలంబన.

సంసార సమస్యల్ని పరిష్కరించుకోవటానికి స్ట్రాంగర్‌ మారేజెస్‌ ఆదర్శమవుతుంటాయి.

మనలో మాట

ఇండిపెన్డెన్సీ అంటూ డిపెన్డెన్సీని స్వేచ్ఛను హరించేదిగా పరిగణించకూడదు.

భాగస్వామికి కొంత సమయాన్ని కేటాయించటం, ఇంకొంత అటెన్షన్‌ పేచేయటం ఫ్రీడమ్‌ని కోల్పోవటం కాదు.

వివాహం పేరిట లేనిపోనివి ఊహించుకుని గాయపడటం మనసు మసకేయటం వల్లనే.

సమస్యను పొడిగించుకోకపోవటమే పరిష్కార సూత్రం.

ప్రతీ విషయంలోను పంతాలకూ పట్టింపులకూ పోయినా, అయినదానికీ కానిదానికీ వాదులాటకు దిగినా, సానుకూలంగా స్పందించక నెగిటివ్‌ ఆలోచనలతో ఎమోషనల్‌ అవుతున్నా, జీవిత భాగస్వామి ప్రతిచర్యనూ భూతద్దంలో చూస్తున్నా వివాహ వ్యవస్థ భారంగానే తయారవుతుంది.

లాస్ట్‌ బట్‌ నాట్‌ ది లీస్ట్‌ –

కేరింగ్‌, కంపాషన్‌, కరేజ్‌లతో మూడుముళ్ల బంధం బలపడితే దాంపత్య జీవితం అద్వితీయ బంధం అవుతుంది.

అన్నట్టు పూరీజీ!

కేరింగ్‌, కంపాషన్‌, కరేజ్‌లు కలగవిస్తేనే స్నేహమైనా, సహజీవనమైనా, సంసారబంధమైనా.

పెళ్లి చేసుకుని భార్యాభర్తలం అయినప్పటికీ ఫ్రెండ్స్‌లా ఉంటాం అని సెలవిచ్చారు కాబట్టి విూ అడుగుజాడలలోనే విూ అభిమానుల్ని అడుగువేయనివ్వండి ప్లీజ్‌.

ఇలా ఏడడుగుల బంధాన్ని భారతదేశంలో పుట్టి బట్ట కడుతున్నందుకు 'మనీషి'గా కాకపోయినా 'మనిషి'గా నైనా గౌరవిద్దాం.

డా. వాసిలి వసంతకుమార్‌

సెల్‌ : 9393933946    
[email protected]