రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం మొగలిపువ్వు ట్రయిలర్ ఈ రోజు బయటకు వచ్చింది. ట్రయిలర్ కట్ చేయడంలో దానికి సరైన నేపథ్య సంగీతం సమకూరేలా చూడడంలో ఆర్జీవీ దిట్ట. అందువల్ల దాని మంచి చెడ్డల గురించి సందేహం లేదు. కానీ, ఎటొచ్చీ ఈ సినిమా సచిన్ జోషి కోసం బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసినట్లా? లేక సచిన్ కు తెలుగు ఆడియన్స్ అంటే ఇష్టం కాబట్టి, వారి కోసం తీసినట్లా? అదే అనుమానంగా వుంది ట్రయిలర్ చూస్తుంటే.
ఎందుకంటే ట్రయిలర్ హిందీ సినిమాకు తెలుగు డబ్బింగ్ వెర్షన్ లా కనిపిస్తోంది తప్ప, తెలుగు మొహాలు, కానీ ఆ ఛాయలు కానీ అస్సలు కనిపించడం లేదు. పైగా టేకింగ్ లో కాస్త అడ్వాన్స్ డ్ శృంగారం కూడా బాలీవుడ్ సినిమా లుక్ తీసుకువచ్చింది. అంటే సచిన్ తన కోసం ఓ బాలీవుడ్ థ్రిల్లర్ ను తీసిపెట్టమని వర్మను అడిగి వుండొచ్చు. పనిలో పని తెలుగులోకి అనువందించి వుండొచ్చు.లేదా ద్విభాషా చిత్రం అని కూడా అనేసి వుండొచ్చు.
థ్రిల్లర్లు ఇష్టపడేవారు ఎలాగూ ఫేస్ ల కోసం కాకుండా థ్రిల్ కోసం చూస్తారు. పైగా ఆర్జీవీ సినిమా అంటే ఇష్టపడేవారు ఎలాగూ వుంటారు. అన్నింటికి మించి పన్నెండు కోట్ల బడ్జెట్ అంటే పెద్ద కానే కాదు. సినిమాకు బాలీవుడ్ శాటిలైట్, మార్కెట్ నే సరిపోతుంది. మొత్తానికి సచిన్, ఆర్జీవీ కలిసి సేఫ్ గేమ్ ఆడుతున్నట్లే.