వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్న హీరో నారా రోహిత్ మరో సినిమాకు ఓకె చెప్పేసాడు. కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ ను నిర్మించిన నిర్మాత బివి శ్రీనివాస్ తన మాగ్నస్ సిని ప్రయిమ్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తారు.
కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని ఈ సినిమాకు దర్శకుడు. ఇటీవల భలే భలే మగాడివోయ్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. నారా రోహిత్ అభిరుచికి తగినట్లే ఓ వైవిధ్యమైన పాయింట్ తో కథ తయారుచేసాడు దర్శకుడు.
దాంతో ఫస్ట్ సిటింగ్ లోనే సినిమా ఓకె చేసాడు రోహిత్. ప్రస్తుతం రోహిత్ ప్రాజెక్టులు రెండు లైన్ లోవున్నాయి. ఈ రెండూ అక్టోబర్ ఎండ్ కు ముగుస్తాయి. ఈ సినిమా నవంబర్ లో ప్రారంభమవుతుంది.