Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్రహోత్సవానికి మహేష్ రెడీ

బ్రహోత్సవానికి మహేష్ రెడీ

శ్రీమంతుడు హాలీడే ముగిసినట్లే. దాదాపు వంద కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది నిర్మాతలకు. ఇప్పుడు మహేష్ తరువాత సినిమాకు రెడీ అయిపోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మించే బ్రహ్మోత్సవం లెంగ్తీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు.

ఈ షెడ్యూలు ఈ నెల 16 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ లో దాదాపు ఫుల్ స్టార్ కాస్ట్ పాల్గొంటుందని సమాచారం. ఫ్యామిలీ స్టోరీ బేస్ చేసుకుని సాగే సినిమాలో ముగ్గురు కథానాయకులు నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాజల్, సమంత, ప్రణీత ఇప్పటికి ఫిక్సయ్యారు. సమంత ప్లేస్ లో మార్పులు చేర్పులు వుంటాయని వార్తలు వినవచ్చాయి కానీ, అదేమీ లేదని యూనిట్ వర్గాల బోగట్టా. శ్రీకాంత్ సినిమాలకు పనిచేసే విక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?