శ్రీను వైట్లకు చాన్స్ తక్కువేనా?

అఖిల్ తొలి సినిమా విడుదల ఫిక్సయిపోయింది. షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేసింది. అప్పుడే మలి సినిమాపై అభిమానుల ఆలోచనలు పెరిగిపోయాయి. పలువురు డైరక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీనువైట్ల, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్,…

అఖిల్ తొలి సినిమా విడుదల ఫిక్సయిపోయింది. షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేసింది. అప్పుడే మలి సినిమాపై అభిమానుల ఆలోచనలు పెరిగిపోయాయి. పలువురు డైరక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీనువైట్ల, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాధ్, ఇలా చాలా జాబితానే వుంది.  

అయితే ఇవన్నీ వట్టి వదంతులేనంట..సినిమా అక్టోబర్ మూడోవారంలో విడుదలవుతుంది. నవంబర్ లో మాత్రమే తరువాత సినిమా మీద నిర్ణయం తీసుకుంటా అని అఖిల్ తన సన్నిహితులతో చెబుతున్నాడంట. జనవరి నాటికి ఏ డైరక్టర్ అందుబాటులో వుంటే, అది కూడా ఆ డైరక్టర్ తనకు సూటబుల్ అనుకుంటే, అతని దగ్గర తనకు నప్పే కథ వుంటే, అప్పడు ఓకె అంటాడని తెలుస్తోంది.

అయితే శ్రీను వైట్లకు అఖిల్ తో చేయాలని వుంది కానీ, అఖిల్ ప్రయారిటీ లిస్ట్ లో శ్రీనువైట్ల పేరు ముందుగా లేదని వినికిడి. జనవరి నాటికి త్రివిక్రమ్, కొరటాల శివ, పూరి ముగ్గురు రెడీగానే వుండొచ్చు కానీ, కథ సరైనది పడాలి కదా..