సమంత..సూపర్

ట్విట్టర్ వాడుకునే హీరోయిన్లలో శృతి, సమంత చాలా స్పీడ్ గా వుంటారు. ముఖ్యంగా తమ గ్లామర్ ను తెలియచేసే, అప్ డేట్ లను ఎప్పటికప్పుడు ట్వీట్ చేయడం అలవాటు. ఖజానా జ్యూయలర్స్ కోసం చేసిన…

ట్విట్టర్ వాడుకునే హీరోయిన్లలో శృతి, సమంత చాలా స్పీడ్ గా వుంటారు. ముఖ్యంగా తమ గ్లామర్ ను తెలియచేసే, అప్ డేట్ లను ఎప్పటికప్పుడు ట్వీట్ చేయడం అలవాటు. ఖజానా జ్యూయలర్స్ కోసం చేసిన లేటెస్ట్ ఫొటో షూట్ కు చెందిన ఓ ఫొటోను శామ్ ఈ రోజు పోస్ట్ చేసింది.

గోల్డ్ కలర్ డ్రెస్త్ తో పోతపోసిన బంగారం లా మెరిసిపోతోంది. మాంచి రిచ్ డ్రెస్ తో, సింపుల్ జ్యూయలరీతో, డిఫరెంట్ హైర్ స్టయిల్ తో సమంత నిజంగా భలేగా వుంది. ఎప్పటికప్పుడు ఇలాంటి సూపర్ ఫొటోలు విడుదల చేయడం ద్వారా తనం అందాలు ఏమాత్రం తగ్గలేదని గుర్తు చేస్తూవుంటుంది. మరికొన్ని సినిమాలు సైన్ చేస్తూ వుంటుంది.

ఇప్పటికే తెెలుగులో రెండు, తమిళంలో రెండు పెద్ద సినిమాలు చేతిలో వున్నాయి.