ఈ సెంటిమెంట్లు నిజమయ్యాయి

బాలయ్య సినిమా లయన్ అడియో ఫంక్షన్ లో చంద్రబాబు మాట్లాడుతూ తాను గతంలో అధికారంలోవున్నపుడు రెండు బాలయ్య సినిమాలకు గెస్ట్ గా వచ్చానని, అవి హిట్ అయ్యాయని అన్నారు. ఇది కూడా హిట్ అవుతుందన్నారు.…

బాలయ్య సినిమా లయన్ అడియో ఫంక్షన్ లో చంద్రబాబు మాట్లాడుతూ తాను గతంలో అధికారంలోవున్నపుడు రెండు బాలయ్య సినిమాలకు గెస్ట్ గా వచ్చానని, అవి హిట్ అయ్యాయని అన్నారు. ఇది కూడా హిట్ అవుతుందన్నారు. ఆ సెంటిమెంట్ అంతగా వర్కవుట్ కాలేదు. లయన్ కు ఏవరేజ్ టాక్ వచ్చింది. అయితే మరో రెండు సెంటి మెంట్లు మాత్రం బాగానేవర్కవుట్ అయ్యాయి.

ఒకప్పటి హీరో సురేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక నటించిన సినిమాల పలితాలన్నీ అంత పాజిటివ్ కాదు. ఇంకా చెప్పాలంటే నెగిటివ్ నే. శ్రీమన్నారాయణ, ఓం (త్రీడి), వంటి ఉదాహరణలు వున్నాయి. 

ఇక నటి అర్చన వ్యవహారం కూడా అలాంటిదే. ఆమెకు సినిమాలు అంతగా కలిసి రాలేదు. ఖలేజా లాంటి సినిమాలో చిన్న పాత్రలోకనిపించింది. బాలకృష్ణ పాండురంగడులో కూడా నటించింది.

బాబు సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు కానీ ఈ ఇద్దరిసెంటిమెంట్ మాత్రం వర్కవుట్ అయిందంటున్నారు సినిమా జనాలు.