విల‌న్‌గా ఆర్యన్ రాజేష్‌

ఈవీవీ త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఆర్యన్ రాజేష్‌. ఎవ‌డిగోల వాడిదే, లీలీమ‌హ‌ల్ సెంట‌ర్‌లాంటి మంచి సినిమాలున్నా, నాన్న అండ ఉన్నా…. నెగ్గుకురాలేక‌పోయాడు. ఆ త‌ర‌వాత పెళ్లి చేసుకొని త‌మ్ముడు న‌రేష్‌కి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.…

ఈవీవీ త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఆర్యన్ రాజేష్‌. ఎవ‌డిగోల వాడిదే, లీలీమ‌హ‌ల్ సెంట‌ర్‌లాంటి మంచి సినిమాలున్నా, నాన్న అండ ఉన్నా…. నెగ్గుకురాలేక‌పోయాడు. ఆ త‌ర‌వాత పెళ్లి చేసుకొని త‌మ్ముడు న‌రేష్‌కి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈవీవీ సినిమా ప‌తాకం బాధ్యత‌లు చూసుకొంటున్నాడు. బందిపోటు సినిమాని రాజేష్ నిర్మాత‌. 

అయితే న‌ట‌న‌పై ఆస‌క్తి ఏమాత్రం త‌గ్గలేదు.త్వర‌లోనే మ‌ళ్లీ మొహానికి రంగు వేసుకోబోతున్నాడు. హీరోగా కాదు… విల‌న్‌గా. అవును ఆర్యన్ రాజేష్ విల‌న్ గా అవ‌తారం ఎత్తబోతున్నాడు. అదీ… న‌రేష్ సినిమాలోనే. న‌రేష్ క‌థానాయ‌కుడిగా న‌టించే ఓ చిత్రంలో రాజేష్ విల‌న్ పాత్రలో క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రం ఈవీవీ బ్యాన‌ర్‌పైనే తెర‌కెక్కించ‌నున్నారు. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.