సచిన్ సినిమా 12 కోట్లేనా?

సచిన్ జోషితో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా ఫినిష్ చేసేసాడు. దాని టీజర్ కూడా రేపు విడుదల కాబోతోంది. మొగలి పువ్వు అనే టైటిల్ తో తయారైందీ సినిమా. రామ్ గోపాల్ వర్మ…

సచిన్ జోషితో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా ఫినిష్ చేసేసాడు. దాని టీజర్ కూడా రేపు విడుదల కాబోతోంది. మొగలి పువ్వు అనే టైటిల్ తో తయారైందీ సినిమా. రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యన కాంట్రాక్టు పద్దతిన సినిమాలు చేస్తున్నారు. అంటే మరేమీ కాదు..ఇంతబడ్జెట్ లో సినిమా తీసి చేతిలో పెడతా అని చెప్పి, ఆ మేరకు అన్ని బాధ్యతలు తనపై వేసుకుని చేయడం. 

ఆయనను మరి కొంత మంది కూడా అదే బాటు పడుతున్నారు. అది వేరే సంగతి. అయితే ఇటీవలి కాలంలో వర్మ చేసిన వన్నీ చిన్న సినిమాలే. ఒక్క రౌడీ మాత్రమే పన్నెండు కోట్ల కాంట్రాక్టు. ఇప్పుడు సచిన్ జోషి సినిమా కూడా పన్నెండు కోట్లలో తీసేసారని వినికిడి. లక్షల్లో సినిమా చేసే ఆర్జీవీ 12 కోట్లలో సినిమా చేయడం అంటే ఆశ్చర్యం కాదు. 

కానీ సచిన్ జోషి ఈ సినిమా కోసం భారీగా ఖర్చుచేస్తున్నాడని, విదేశాల్లో పాటల చిత్రీకరణ అని వార్తలు వచ్చాయి ఆరంభంలో. కానీ అంతా చేసినా, బడ్జెట్ 12 కోట్లేనట. కొన్నాళ్ల క్రితం వర్మ, మంచు ఫ్యామిలీకి కూడా 12 కోట్లలో రౌడీ సినిమా తీసి ఇచ్చాడు. వర్మ టాలీవుడ్ రిటర్న్ తరువాత భారీ బడ్జెట్ తో చేసిన సినిమాలు ఈ రెండే. మిగిలనవన్నీ చిన్నా చితకా సినిమాలే.