లిప్ కిస్ సీన్ ను ఆర్జీవీ ఎలా వివరిస్తాడు?

రామ్ గోపాల్ వర్మ ఈమధ్య తీస్తున్న సినిమాలన్నీ బోల్డ్ గా ఉంటున్నాయి. అప్పట్లో మియా మాల్కోవాను పెట్టి ఓ న్యూడ్ సినిమా తీశాడు. ఇప్పుడు ఏకంగా లెస్బియన్ కంటెంట్ తో డేంజరస్ అనే సినిమా…

రామ్ గోపాల్ వర్మ ఈమధ్య తీస్తున్న సినిమాలన్నీ బోల్డ్ గా ఉంటున్నాయి. అప్పట్లో మియా మాల్కోవాను పెట్టి ఓ న్యూడ్ సినిమా తీశాడు. ఇప్పుడు ఏకంగా లెస్బియన్ కంటెంట్ తో డేంజరస్ అనే సినిమా తీశాడు. ఎల్లుండి రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో అప్సర రాణి, నైనా గంగూలీ లీడ్ రోల్స్ పోషించారు.

ఈ సినిమాలో హీరోయిన్లు ఇద్దరూ స్వలింగ సంపర్కులుగా నటించారు. లిప్ కిస్సులు కూడా పెట్టుకున్నారు. అయితే ఇలాంటి సన్నివేశాల్ని ఆర్జీవీ ఎలా డైరక్ట్ చేశాడు? లిప్ కిస్ సీన్లు వివరించేటప్పుడు తను ముద్దు పెట్టి చెప్పేవాడా? ఇద్దరు హీరోయిన్ల లిప్ కిస్సును వర్మ ఎలా హ్యాండిల్ చేశాడు?

ఈ ప్రశ్నలకు వర్మ సూటిగా సమాధానం చెప్పాడు. లిప్ కిస్ సీన్ ఉన్నప్పుడు దర్శకుడు ముద్దు పెట్టి చెప్పడని, ఆ సీన్ ను వివరిస్తాడని, తను కూడా అదే చేశానని అన్నాడు. సీన్ పెర్ ఫెక్ట్ గా వచ్చేవరకు అప్సర-నైనా లిప్ కిస్సుల్ని పదే పదే తీస్తూనే ఉన్నానని అన్నాడు.

అటు అప్సర-నైనా కూడా లిప్ కిస్సులపై సెక్సీగా స్పందించారు. ముద్దుపెట్టాల్సి వస్తే నైనా పెదాల్ని ముద్దాడుతానని, ఆర్జీవీ బుగ్గల్ని ముద్దాడుతానని అప్సర రాణి తెలిపింది. శుక్రవారం రిలీజ్ అవుతున్న డేంజరస్ సినిమాకు ఇలా తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నాడు వర్మ.