వారసత్వం మనకే కాదు…. బాలీవుడ్‌కీ మామూలే! తమ వారసుల్ని కూడా రంగంలో దింపడానికి అక్కడ బాడా హీరోలు భారీ ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా కెమెరా ముందుకొస్తున్నాడని బాలీవుడ్ టాక్. ఆర్యన్ కి కెమెరా కొత్తేం కాదు.
అంతకు ముందు బాల నటుడిగా బాలీవుడ్ కి పరిచయమే. కభీఖుషీ కఖీగమ్ చిత్రంలో బాల షారుఖ్ గా కనిపించాడు. ఆర్యన్ 18వ యేట అడుగు పెడుతున్నాడు. ఈలోగా అన్ని విషయాల్లోనూ శిక్షణ తీసుకొంటున్నాడు. ఈలోగా తనకు దగిన కథ సిద్ధం చేయాలని షారుఖ్ భావిస్తున్నాడట.
మరోవైపు ఆషికీ 3 హీరో ఆర్యనే అని బాలీవుడ్ చెబుతోంది. శ్రీదేవి తయన జాహ్నవి ఈ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వబోతోందని చెబుతున్నారు. అదే నిజమైతే అందరి కళ్లూ ఆషికి 3 మీదే. ఇద్దరు స్టార్ వారసుల్ని ఒకేసారి తెరపై చూసేయొచ్చు. మరి ఈ కల ఫలిస్తుందో లేదో మరి.