సచిన్ దొరికాడా?

సచిన్ జోషీ..సినిమా అంటే తపన, పిచ్చి, ఇంకా చాలా చాలా వున్న బంగారు పిచ్చుక. ఇప్పుడు ఓ తెలుగు సినిమా చేస్తున్నాడు. మరోపక్క రామ్ గోపాల్ వర్మతో మరో సినిమా చేయనున్నట్లు ఆ మధ్యనే…

సచిన్ జోషీ..సినిమా అంటే తపన, పిచ్చి, ఇంకా చాలా చాలా వున్న బంగారు పిచ్చుక. ఇప్పుడు ఓ తెలుగు సినిమా చేస్తున్నాడు. మరోపక్క రామ్ గోపాల్ వర్మతో మరో సినిమా చేయనున్నట్లు ఆ మధ్యనే వార్తలు వినవచ్చాయి. ఇప్పడు టెంపర్ సినిమా హిందీ వెర్షన్ తాను చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

మరి ఇంతకీ ఈ సినిమాకు పూరియే దర్శకుడిగా వుంటారా? లేక మరెవరైనానా? లేక వర్మ టెంపర్ సినిమానే సచిన్ తో హిందీలో చేస్తాడా? పూరి హిందీలో చేయాలనుకుంటే,  గురుశిష్యులిద్దరితో సచిన్ చెరో సినిమా చేస్తాడన్నమాట. పూరి సంగతి ఎలా వున్నా, నవదీప్, నందూ లాంటి చిన్న హీరోలతో సినిమాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్న రామ్ కు సచిన్ లాంటి పెద్ద పార్టీ తోడు కావడం మంచి చాన్సే.