ఎన్టీఆర్ ఇప్పటికైనా క‌నిక‌రిస్తాడా??

ఊస‌ర‌వెల్లి త‌ర‌వాత ర‌చ‌యిత వ‌క్కంతం వంశీకి మాటిచ్చాడు ఎన్టీఆర్‌. `నీతో ఓ సినిమా చేస్తా.. క‌థ రెడీ చేస్కో` అని అభ‌యం అందించాడు. ఆ ఉత్సాహంతో ఓ క‌థ కూడా వినిపించాడు వ‌క్కంతం. అదే…

ఊస‌ర‌వెల్లి త‌ర‌వాత ర‌చ‌యిత వ‌క్కంతం వంశీకి మాటిచ్చాడు ఎన్టీఆర్‌. `నీతో ఓ సినిమా చేస్తా.. క‌థ రెడీ చేస్కో` అని అభ‌యం అందించాడు. ఆ ఉత్సాహంతో ఓ క‌థ కూడా వినిపించాడు వ‌క్కంతం. అదే టెంప‌ర్‌. అనుకోని కార‌ణాల వ‌ల్ల ఈ క‌థ‌నే పూరి చేతిలో పెట్టాల్సివ‌చ్చింది. దాంతో టెంప‌ర్ మొద‌లైంది, పూర్తయింది, హిట్టయ్యింది. పూరి హ్యాపీ, ఎన్టీఆర్ కూడా హ్యాపీనే. పాపం.. వ‌క్కంతం వంశీ మాటేంటి??  

ఎన్టీఆర్‌కి హిట్ కావ‌ల్సివ‌చ్చిన‌ప్పుడు త‌న క‌థ‌ని పూరి కోసం త్యాగం చేశాడు వ‌క్కంతం. ఈ త్యాగానికి మంచి ఫ‌లితం వ‌చ్చింది. మ‌రి ఎన్టీఆర్ ఇప్పుడైనా త‌న మాట నిల‌బెట్టుకొంటాడా??  ఎన్టీఆర్ ఓకే అంటే.. మ‌రో మంచి క‌థ‌తో కెప్టెన్ కుర్చీలో కూర్చోవాల‌ని వంశీ ఆశ‌గా ఎదురుచూస్తున్నాడు. టెంప‌ర్ టెంపోలో ఉన్న ఎన్టీఆర్‌… ఇప్పుడైనా వ‌క్కంతానికి ఛాన్స్ ఇస్తాడా