టాలీవుడ్ లో హీరోలకు నిర్మాణ భాగస్వామ్యాలు ఇస్తే మాత్రం నిర్మాతలకు తలనొప్పే. రెమ్యూనిరేషన్ మాత్రం అందుకుంటే నిర్మాత ఏం ఖర్చు చేస్తున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారు అన్నది అస్సలు పట్టించుకోరు హీరోలు. పైగా ఇంకా..ఇంకా అంటారు. అదే నిర్మాణ భాగస్వామ్యం వుంటే మాత్రం ఈకకు ఈక.. తోకకు తోక లాగుతారు.. పీకుతారు.
ఇంత ఖర్చు ఎందుకయింది అని నిలదీస్తారు. ఆఖరికి సంబంధాలు చెడిపోతాయి. అందువల్ల ఇందులో బోధపడే సత్యం ఏమిటంటే హీరోకి ఇవ్వాల్సిన రెమ్యూనిరేషన్ ఇచ్చేయడం బెటర్.
ఆ మధ్య ఓ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. పెద్ద బ్యానర్. హీరో అప్పటికే ఒక సినిమా చేసారు. అది కూడా హిట్టే. రెండు హిట్ లు తరువాత మూడో సినిమా చేయాల్సి వుంది. కానీ అది ఇప్పుడు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. దీనికి కారణం బ్లాక్ బస్టర్ సినిమా ఖర్చు గురించి నిర్మాత-హీరో మల్లగుల్లాలు పడడమే అని తెలుస్తోంది.
దాదాపు 45 కోట్లు ఖర్చు చూపించారని తెలుస్తోంది. అంత ఎందుకు అయిందన్నది హీరో ప్రశ్న. అప్పటికీ రికార్డులు, లెక్కలు అన్నీ చూపించే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. కానీ వాటితో సంతృప్తి చెందని హీరో సినిమా క్యాన్సిల్ కొట్టినట్లు తెలుస్తోంది.