నాగార్జునకి ఆ రికార్డు లేనట్టే

మనంతో నిర్మాతగా, నటుడుగా, కొడుకుగా… ఎంతో ఆనందాన్ని చవిచూసిన నాగార్జున… ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో గ్రాండ్‌ హిట్‌తో టీవీ రంగంలో కూడా తన ముద్ర వేసాడు. అయిదారేళ్ల పాటు పరాజయాలతో విసిగిపోయిన నాగార్జునకి…

మనంతో నిర్మాతగా, నటుడుగా, కొడుకుగా… ఎంతో ఆనందాన్ని చవిచూసిన నాగార్జున… ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో గ్రాండ్‌ హిట్‌తో టీవీ రంగంలో కూడా తన ముద్ర వేసాడు. అయిదారేళ్ల పాటు పరాజయాలతో విసిగిపోయిన నాగార్జునకి ఒకేసారి ఉపశమనం దక్కినట్టయింది. 

మనంతో నలభై కోట్ల షేర్‌ కూడా అందుకుంటాడని అనుకున్న అభిమానులకి ఆ ఆశలు నిజం కాలేదు. ఈ చిత్రం ఓవరాల్‌గా ముప్పయ్‌ ఎనిమిది కోట్ల షేర్‌తో సరిపెట్టుకునేట్టుంది. కలెక్షన్స్‌ బాగా తగ్గాయి కనుక ఇక నలభై కోట్ల షేర్‌ సాధించడం కష్టమని ట్రేడ్‌ వర్గాలు తేల్చేసాయి. అయితే ఈ కలెక్షన్స్‌తోను దీనికి బ్లాక్‌బస్టర్‌ స్టేటస్‌ అయితే దక్కింది. 

నాగార్జునకి నలభై కోట్ల ముచ్చట కూడా మనం తీర్చేస్తుందనే అభిమానుల ఆశలు నిజం కాలేదనే లోటు తప్పితే ఈ సినిమా చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఇక నాగార్జున ఎలాగో మల్టీస్టారర్స్‌ మీద ఆసక్తి చూపిస్తున్నాడు కాబట్టి నలభై, యాభై కోట్లు సాధించడం తనకి మున్ముందు కష్టం కాబోదు.