సమంతతో మూడేస్తాడా?

నాగచైతన్యతోనే కెరీర్‌ స్టార్ట్‌ చేసిన సమంత ఇప్పుడు అతనికంటే చాలా పెద్ద స్టార్‌ అయిపోయింది. చైతన్యతో ఏమాయ చేసావె, మనంతో రెండు విజయాలు అందుకున్న సమంత ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం చూస్తోంది. ఈ శుక్రవారం…

నాగచైతన్యతోనే కెరీర్‌ స్టార్ట్‌ చేసిన సమంత ఇప్పుడు అతనికంటే చాలా పెద్ద స్టార్‌ అయిపోయింది. చైతన్యతో ఏమాయ చేసావె, మనంతో రెండు విజయాలు అందుకున్న సమంత ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం చూస్తోంది. ఈ శుక్రవారం రిలీజవుతోన్న ఆటోనగర్‌ సూర్య వీరిద్దరి మూడో చిత్రం. దీంతో హ్యాట్రిక్‌ కంప్లీట్‌ చేస్తారో లేదో చూడాలి. 

సమంత ట్రాక్‌ రికార్డ్‌ అయితే భేషుగ్గా ఉంది. అప్పుడప్పుడూ జబర్దస్త్‌, రామయ్యా వస్తావయ్యాలాంటి పరాజయాలు తప్పించి ఇప్పటికీ తన సక్సెస్‌ రేట్‌ చాలా ఎక్కువ ఉంది. అదే జోరు కొనసాగించి తన అదృష్టాన్ని ఈ సినిమాకి కూడా పాస్‌ చేసినట్టయితే ఇంతకాలం ఆపసోపాలు పడ్డదానికి రిజల్ట్‌ వచ్చేస్తుంది. 

ఈ చిత్రంపై నాలుగేళ్ల పాటు శ్రమించిన దేవా కట్టా, మాస్‌ హీరోగా మొదటి హిట్‌ కోసం చూస్తోన్న చైతన్య… ఇది హిట్టయితే అప్పులు కొన్ని తీర్చుకోవచ్చని చూస్తున్న నిర్మాతలు అందరూ ‘ఆటోనగర్‌ సూర్య’పై చాలా ఆశలు పెట్టుకున్నారు.