ఈమధ్య పెద్దగా సినిమాలు రావట్లేదని రిటైర్ అయిపోయుంటాడని అనుకుంటున్నారేమో కానీ ఇంకా వరుణ్ సందేశ్ ఇండస్ట్రీని వదిలి పోలేదు. ఇప్పటికీ తన చేతిలో ఒక రెండు, మూడు సినిమాలున్నాయి. ఆరంభంలో రెండు బ్లాక్బస్టర్లు సాధించేసి ఆనక చప్పబడిపోయిన వరుణ్ సందేశ్ మళ్లీ పొరపాట్న కూడా ఒక సగటు సినిమా ఇవ్వలేకపోయాడు.
అవకాశాలకి అయితే దండిగా వచ్చాయి కానీ విజయాలే కరవైపోయాయి. తన మొదటి రెండు సినిమాల పేరు చెప్పుకుని చాలా కాలం బండి నెట్టేసాడు కానీ ఇక దానిపై డిపెండ్ అయి లాభం లేదు. ఇప్పుడైనా వరుణ్ సందేశ్ తన సత్తా చాటుకుని తీరాలి. లేదంటే ఇక అవకాశాలిచ్చే వాళ్లే ఉండరు.
ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు విడుదల కాగలిగితే అవే అతని లాస్ట్ హోప్. మొదట్లో పెద్ద దర్శకులు, పెద్ద బ్యానర్లు ఉండడం వల్ల తన పని సులువైపోయింది కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా అదృష్టం మీదే తన తదుపరి కెరీర్ డిపెండ్ అయి ఉంది.