దాదాపు నెలకోసారి అల్లు అర్జున్ పీఆర్వో నుంచి ఒక ప్రెస్‌నోట్ వస్తుంటుంది. అల్లు అర్జున్ ఫేస్‌బుక్ అకౌంట్‌కి అన్ని లక్షల లైక్స్ వచ్చాయి… ఇది సౌతిండియాలో రికార్డు అంటూ. ఆ టెంప్లేట్ ప్రెస్‌నోట్ రెడీగా ఉంచుకుని అంకెలు మార్చి ఎప్పటికప్పుడు మీడియాకి పంపిస్తుంటారనుకుంట.
ట్విట్టర్‌లో ఫాలోవర్స్ కౌంట్, ఫేస్‌బుక్‌లో లైక్స్‌ని బట్టి ఒక హీరో స్టామినాని తేల్చేయలేం. ఫలానా హీరోకంటూ అఫీషియల్ అకౌంట్ ఉంటే ప్రతి ఒక్కరూ ఫాలో అయిపోతారు. ఒకసారి రేసులో ముందుంటే… ఇక అతను ఎల్లకాలం ముందుండడంలో విశేషం లేదు. దీనిని పట్టుకుని నలభై లక్షలు మాకే ఉన్నారు.. యాభై లక్షలు మాకే ఉన్నారంటూ హడావుడి అక్కర్లేదు.
అల్లు అర్జున్‌ది హీరోగా ఏ స్థానమో, తన స్టార్‌డమ్ ఎంతో అందరికీ తెలుసు. కనుక ఇప్పటికైనా ఈ ప్రెస్‌నోట్లు ఆపేసి… మరీ అంత సరదాగా ఉంటే పాతిక లక్షలకోసారి డప్పు వాయించుకుంటే బాగుంటుంది. అసలుకైతే ఇలాంటి సిల్లీ రికార్డుల గురించి దరువేయడం అల్లు అర్జున్ ఆపించేస్తే మరీ బాగుంటుంది.