ఈ శీనుకి చాలా సీనుంది

వినాయక్‌ దర్శకత్వంలో పరిచయం అవుతోన్న బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ఏమాత్రం సక్సెస్‌ అవుతాడో కానీ తన తండ్రి మాత్రం అతనిపై కోట్లు ధారబోస్తున్నాడు. తనయుడిని మొదటి సినిమాతోనే స్టార్‌ని చేయడానికి…

వినాయక్‌ దర్శకత్వంలో పరిచయం అవుతోన్న బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ఏమాత్రం సక్సెస్‌ అవుతాడో కానీ తన తండ్రి మాత్రం అతనిపై కోట్లు ధారబోస్తున్నాడు. తనయుడిని మొదటి సినిమాతోనే స్టార్‌ని చేయడానికి సురేష్‌ దీనిపై అవధులకి మించి ఖర్చు పెడుతున్నాడు. 

అంత డబ్బుకి న్యాయం చేసే సీన్‌ ఈ శ్రీనివాస్‌కి ఉందా అంటే… ఉందని అంటున్నాడు వినాయక్‌. ‘అల్లుడు శీను’తో పరిచయం అవుతోన్న శ్రీనివాస్‌ చాలా ప్రతిభావంతుడని, ఈ సినిమాతోనే హీరోగా మంచి స్థాయికి వచ్చేస్తాడని వినాయక్‌ జోస్యం చెబుతున్నాడు. అన్ని విషయాల్లోను పూర్తిగా తర్ఫీదు పొంది హీరోగా అడుగు పెట్టిన శ్రీనివాస్‌ స్టార్‌ కాగలడని వినాయక్‌ అంటున్నాడు. 

అల్లుడు శీను నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైనర్‌ అని, కామెడీ, రొమాన్స్‌, యాక్షన్‌ అన్నీ మిళితమై ఉంటాయని వినాయక్‌ చెప్పాడు. ఈ చిత్రంలో బ్రహ్మానందం కీ రోల్‌ చేస్తున్నాడట. శీను వెంటే ఉంటూ అల్లుడూ అల్లుడూ అని పిలుస్తుంటాడని, అందుకే టైటిల్‌ కూడా అల్లుడు శీను అని ఫిక్స్‌ చేసామని వినాయక్‌ చెప్పాడు.