వరుణ్‌ తేజ్‌ దానికి ఓకే చెప్పాడా?

నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ మొదటి చిత్రం ‘గొల్లభామ’ షూటింగ్‌ శరవేగంగా జరిగిపోతుంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రం రిలీజ్‌ అవుతుందని వార్తలొస్తున్నాయి. బౌండ్‌ స్క్రిప్ట్‌తో షూటింగ్‌కి వెళ్లడంతో ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేస్తున్నారు.…

నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ మొదటి చిత్రం ‘గొల్లభామ’ షూటింగ్‌ శరవేగంగా జరిగిపోతుంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రం రిలీజ్‌ అవుతుందని వార్తలొస్తున్నాయి. బౌండ్‌ స్క్రిప్ట్‌తో షూటింగ్‌కి వెళ్లడంతో ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేస్తున్నారు. ఇదిలావుంటే వరుణ్‌ తేజ్‌ తదుపరి చిత్రం కూడా ఓకే అయిందని వినిపిస్తోంది. 

హిందీలో హిట్‌ అయిన ఇషక్‌జాదే చిత్రాన్ని తెలుగులో వరుణ్‌ తేజ్‌తో రీమేక్‌ చేస్తారనే టాక్‌ ఉంది. అర్జున్‌ కపూర్‌ని పరిచయం చేస్తూ తీసిన ఆ చిత్రం అక్కడ బాగానే ఆడింది. తెలుగులో దీనిని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా చేస్తారని అనఫీషీయల్‌ న్యూస్‌. 

హిందీ రీమేక్స్‌ ఇక్కడ విజయవంతం అవుతున్నవి చాలా తక్కువ కనుక ఇది ఎంత వరకు రైట్‌ డెసిషన్‌ అనేది చూడాల్సి ఉంది. అయితే గొల్లభామ రిలీజ్‌ అయి, ఆ చిత్రం ఫలితంతో పాటు హీరోకి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ తెలుసుకునే వరకు వరుణ్‌ తేజ్‌ రెండో సినిమా ఓకే అయ్యే అవకాశాలు బాగా తక్కువ.