సాయి కొర్రపాటి వెనుక రాజమౌళి బినామీ పెట్టుబడులు వున్నాయని, కొన్ని రోజులుగా వార్తలు గుప్పు మంటున్నాయి. కానీ అసలు విషయం అది కాదని తెలుస్తోంది. సాయి కొర్రపాటి తో రాజమౌళి కుమారుడు కార్తీక్ (కార్తికేయ) కు వ్యాపార, స్నేహ సంబంధాలు అపారంగా వున్నాయని, అందుకే రాజమౌళి వాటి వ్యవహారాలను ఓ కంట చూస్తుంటారని వినికిడి.
రాజమౌళి కుమారుడు కార్తీక్ కు స్నేహ సంబంధాలు ఎక్కువని. అలాంటి స్నేహ బృందం చేసే వ్యాపారాలన్నింటిలో తన వంతు కొంతయినా వుంటుందని అంటారు. మాదాపూర్ లో ఓ అతిధి గృహాన్ని కూడా ఇలాగే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
ఇదిలా వుంటే సాయి కొర్రపాటికి కాస్త అభిరుచి, స్నేహగుణం వుండడంతో కార్తీక్ దగ్గరయ్యాడని, అలా వ్యాపార సంబంధాలు బలపడ్డాయని చిత్రరంగానికి చెందిన వారు అంటున్నారు. ఏమైతేనేం కాస్త మంచి సినిమాలు వస్తే మంచిదేగా.