రచ్చ చేస్తోన్న సమంత

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత త్వరలో తమిళనాడులో కూడా టాప్‌కి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆమె నటిస్తోన్న రెండు భారీ తమిళ చిత్రాలు అంజాన్‌, కత్తి త్వరలోనే విడుదలకి సిద్ధమవుతున్నాయి. సమంత హీరోయిన్‌…

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత త్వరలో తమిళనాడులో కూడా టాప్‌కి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆమె నటిస్తోన్న రెండు భారీ తమిళ చిత్రాలు అంజాన్‌, కత్తి త్వరలోనే విడుదలకి సిద్ధమవుతున్నాయి. సమంత హీరోయిన్‌ కనుక ఇవి తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్‌ అవుతాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 

ఇక తెలుగులోను సమంత నటించిన సినిమాలు వరుసగా రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఆటోనగర్‌ సూర్య ఈ వారంలో వస్తోండగా, అల్లుడు శీను వచ్చే నెలలో రిలీజ్‌ కానుంది. ఆగస్ట్‌లో ఎన్టీఆర్‌తో చేస్తోన్న రభస రిలీజ్‌ అవుతుంది. అంటే వచ్చే మూడు నెలల్లో సమంత నటించిన సినిమాలు మొత్తంగా అయిదు వస్తాయన్నమాట.

రెండు భాషల్లో కౌంట్‌ చేసుకుంటే ఏడు సినిమాలు రిలీజ్‌ అవుతాయి. సమంత ఎంత బిజీగా ఉందనే దానికే కాదు… మిగతా వాళ్లు ఆమెకంటే ఎంత వెనుకబడి ఉన్నారనేదానికి కూడా ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. ఇప్పటికే మిగతా హీరోయిన్లకి అందనంత ఎత్తులో ఉన్న సమంత ఈ సినిమాలతోను తన అదృష్ట లక్ష్మి ట్యాగ్‌కి న్యాయం చేస్తే ఇప్పట్లో తన దరిదాపులకి ఎవరూ రానట్టే.