అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున ఎంతటి ఆల్ రౌండర్ అన్నది అందరికీ తెలుసు. ఒంటి చేత్తో స్టూడియో వ్యవహారాలు, చిత్ర నిర్మాణాలు, హోటల్ వ్యపారాలు, కొత్త కొత్త వెంచర్లు, రియల్ ఎస్టేట్ ఇలా ఎన్నో చేస్తుంటారాయన. మరో పక్క సినిమాలు మామూలే. ఇప్పుడు నాగ చైతన్య కూడా తండ్రి లాగే తానూ తయారవ్వాలని అనుకుంటున్నట్లుంది.
కేవలం హీరోగానే కాకుండా, అన్నీ తెలుసుకొవాలని అనుకుంటున్నాడు. అందుకే నటన తరువాత తొలి అడుగు నిర్మాణం వైపు వేసాడు. త్వరలో సినిమాలు నిర్మిస్తానని ఇప్పటికే ఓ సారి చెప్పాడు. ఇప్పుడు 'ఒక లైలా కోసం' సినిమా నిర్మాణ వ్యవహారాలన్నీ అతగాడే చూసుకుంటున్నాడట. షెడ్యూళ్లు, ఏర్పాట్లు, ప్లానింగ్, ప్రొడక్షన్ ఇలా అన్నీ.
కేవలం పేమెంట్ సాయాలు మాత్రం నాగార్జున రెగ్యులర్ స్టాఫ్ చూస్తున్నారట. మొత్తానికి నాగార్జున పిల్లలను బాగానే ట్రయినప్ చేస్తున్నట్లు లెక్క. కీపిటప్ చైతూ.