ఆయన ఓ పెద్ద నిర్మాత. అభిరుచి గల నిర్మాత. కానీ ఇప్పుడు చాలా సాదా సీదా పని తలకెత్తుకున్నారన్న అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నటి అంజలి వ్వవహారంలో ఈ నిర్మాత పేరు వినిపిస్తోంది. తమిళ నాట వివాదాలు ఎదుర్కొంటూ, తెలుగునాట సరైన అవకాశాలు వెదుక్కుంటూ అంజలి కిందా మీదా పడుతోంది.
ఇలాంటి సమయంలో ఈ నిర్మాతే ఆమెకు అండగా నిలబడ్డారని అంటున్నారు. అయితే ప్రారంభంలో అండగా నిలబడితే, 'పెద్ద'మనసుతో వ్యవహరించారని అందరూ భావించారు. తరువాత తరువాత డేట్లు కూడా ఆయనే చూస్తున్నారని తెలిసి, అంత 'పెద్ద'మనిషి ఇంత చిన్న పని ఎందుకు తలకెత్తుకున్నారని డౌట్ పడుతున్నారు.
ఏదయితేనేం. పాపం, కష్టాల్లో వున్న అంజలిని ఆదుకునేవారు ఒకరు వున్నారు. అదే పాజిటివ్ థింకింగ్ అంటే.