హాట్‌ హాట్‌ టీచర్‌గా సన్నీలియోన్‌

బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తున్నా ఒకప్పటి పోర్న్‌స్టార్‌ ఇమేజ్‌ ఇంకా చెరిగిపోలేదామెకి. అదే ఆమెకు బలం కాబట్టి, ఆ విషయం ఆమెకు బాగా తెలుసు కాబట్టి, ఎలాగోలా ‘పోర్న్‌స్టార్‌’ అన్న విషయాన్ని మీడియా వద్ద ప్రత్యక్షంగానో…

బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తున్నా ఒకప్పటి పోర్న్‌స్టార్‌ ఇమేజ్‌ ఇంకా చెరిగిపోలేదామెకి. అదే ఆమెకు బలం కాబట్టి, ఆ విషయం ఆమెకు బాగా తెలుసు కాబట్టి, ఎలాగోలా ‘పోర్న్‌స్టార్‌’ అన్న విషయాన్ని మీడియా వద్ద ప్రత్యక్షంగానో పరోక్షంగానో తనంతట తానుగానే ప్రస్తావిస్తూ వస్తోంది సన్నీలియోన్‌.

ఇప్పటికే బాలీవుడ్‌లో హాట్‌ బ్యూటీగా తన సత్తా చాటుకున్న సన్నీలియోన్‌, బాక్సాఫీస్‌ వద్ద కాసుల పండించే ‘దేవత’గా కన్పిస్తోంది కొందరు దర్శక నిర్మాతలకి. ఆమెనిప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలోకీ లాక్కొస్తున్నారు. ఓ సినిమాలో ఆమె హాట్‌ హాట్‌ టీచర్‌గా కన్పించబోతోందన్న ప్రచారం నేపథ్యంలో అప్పుడే ఆ సినిమా చుట్టూ వివాదాలు షురూ అయ్యాయి.

ఏ సినిమా.. ఎవరు హీరో.. ఏంటి కథ.? అన్న విషయాలపై ఇంకా స్పష్టత లేకపోయినా, సన్నీలియోన్‌ టీచర్‌గానా.. ఛీ.. ఇంతకన్నా దరిద్రం ఇంకేముంటుంది.? అంటూ టెలివిజన్‌ డిస్కషన్స్‌లో కొందరు టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తెరపై టీచర్లను అసభ్యంగా చూపించడం ఇప్పుడు కొత్తగా వస్తున్నదేం కాకపోయినా, సన్నీలియోన్‌ టీచర్‌ పాత్రలో.. అనగానే ఆ మాత్రం హడావిడి జరగాల్సిందే.

ఇలాంటి డిస్కషన్స్‌ వల్ల సినిమా ఆగిపోతుందా.? సన్నీలియోన్‌ని తమ సినిమాలో నటించొద్దు లేమ్మా.. అని చిత్ర నిర్మాతలు నమస్కారం పెట్టేస్తారా.? అంటే అవేవీ జరిగే పనులు కావు. కానీ, పరోక్షంగా సన్నీలియోన్‌ నటించే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.. అదే సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ.