ఇండియన్ మీడియా గో బాక్

నమస్తే ఇండియన్ టీవీ చానల్స్  Advertisement నమస్తే  నేపాల్ లో మీ చానల్స్ అన్నీ భూకంపం గురించి అద్భతమైన కవరేజ్చేసినట్లు మీరే చెప్పుకుంటున్నారు. మీరు గాక ఇంకెవరైనా అన్నారా ఆ మాట? అన్ని దేశాలవాళ్ళూ…

నమస్తే ఇండియన్ టీవీ చానల్స్ 

నమస్తే 

నేపాల్ లో మీ చానల్స్ అన్నీ భూకంపం గురించి అద్భతమైన కవరేజ్చేసినట్లు మీరే చెప్పుకుంటున్నారు. మీరు గాక ఇంకెవరైనా అన్నారా ఆ మాట?

అన్ని దేశాలవాళ్ళూ  మమ్మల్ని మెచ్చు కుంటున్నారు.  అసలు మాకే ఆశ్చర్యం గా ఉంది మాకింత కెపాసిటీ ఉందా అని

ఇంతకూ ఏ ఏ దేశాలవాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు?

అలా అడిగితె కష్టం. జెనరల్ టాక్ అది- అసలు నేపాల్ ప్రజలైతే మమ్మల్ని ఆకాశాని కెత్తేసారు. 

అలాగా కాని బీబీసీ వాళ్ళు మీ చానల్స్ గురించీ మాట్లాడుతూ “చాలా ఇన్ సెన్సిటివ్ “అన్నారు కదా

ఆ విషయం మాకు తెలీదే.

మరి నేపాల్ గవర్నమెంట్ కూడా ఇలాంటి చెత్త చానల్స్ ఎక్కడా చూళ్ళేదు అంటోంది కదా

అలా అందా? అది కూడా మా నోటీస్ కి రాలేదే 

ఆఖరికి నేపాల్ ప్రజలు కూడా మీ చానల్స్ ని దుమ్మెత్తి పోస్తున్నారు

ఓ గాడ్! ఇటీజ్ న్యూస్ టు అజ్

మీకు న్యూసేమోగాని ప్రపంచమందరికీ తెలుసు

అలాగా ఇది కూడా న్యూసే మాకు

అంతేకాకుండా ఇండియన్ మీడియా గో బాక్ అనికూడా నేపాల్ గవర్నమెంట్ అంటోంది. వాళ్ళలా అన్న విషయం మరి మీ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ లో ఎందుకు హైలైట్ చేసుకోవటం లేదు? 

ఓ గాడ్ అలా అన్నారా?మాకా విషయమే తేలీదే

పోనీ వాళ్ళలా అనడానికి కారణ మేమై ఉంటుందో అదయినా తెలుసా ?

అదే మాకు అర్ధం కావటం లేదు.

మీరు అక్కడ ఉండగా ఇండియాలో లాగా పిచ్చివాగుడు ఏమైనా వాగారా?

ఏమీ వాగలేదే  ఆ మామూలు గానే అక్కడ కొ౦తమంది నేపాల్ వాళ్ళను వెతికి వాళ్ళను ఇంటర్వ్యూ చేసాం

ఎలాంటి వాళ్ళను వెతికారు?

అదే ఇండియాలో లాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను వెతికి పట్టుకుని వాళ్ళతో మాట్లాడి న్చాము-మేమెప్పుడూ అలాగే చేస్తూన్టాము కదా !

ఏం మాట్లాడారు వాళ్ళు?

భూకంప బాధితులను ఆదుకోవటం లో నేపాల్ ప్రభుత్వం దారుణంగా విఫలమయిందనీ, ఎవరికీ తిండీ నీరూ అందలేదనీ, ఉంటానికి ఇల్లు లేవనీ ఇలా చాల మాట్లాడారు.

కరెంట్ లేకా ట్రాన్స్పోర్ట్ కి రోడ్లు లేకా మధ్య మధ్యలో చిన్న సైజు భూకంపాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూండగా – అక్కడి ప్రభుత్వం అంత పెద్ద విపత్తు ని ఎదుర్కొంటూంటే మధ్యలో మీ చానల్ వాళ్ళు పరిస్తితిని ఇంకా దారుణంగా చిత్రీకరిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టటం చాలా నీచమైన సంస్కారం కదా- 

అందులో తప్పేమీ లేదు. ఇండియా లో మేమెప్పుడూ అలాగే  చేస్తూన్టాము.

అక్కడ కొంతమంది బాధితులు అక్కడి పీఎం వచ్చినప్పుడు రిలీఫ్ మెటీరియల్ సరిగ్గా అందటం లేదని ప్రొటెస్ట్ చేయటం మీరు ఒక సెన్సేషనల్ న్యూస్ గా చూపించటం మోరల్ గా కరెక్ట్ కాదు కదా-

మోరల్స్  అంటే  ఏమిటి? 

సరే అదలా ఉండనీయండి మన ప్రభుత్వం అక్కడ రిలీఫ్ ఆపరేషన్స్ కోసం హెలికాప్టర్స్ పంపుతే ఆ పని చేయనీకుండా మీ చానల్ వాళ్ళు ఆ హెలికాప్టర్స్ ని మీ సైట్ సీయింగ్ కోసం వాడుకున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు-

సైట్ సీయింగ్ కోసం కాదు రిలీఫ్ చేరడానికి వీల్లేకుండా మారు మూల ఇరుక్కు పోయిన విలేజెస్ ని కవర్ చేయడానికి హెలికాప్టర్స్ వాడాము

అవన్నీ మీ చానల్స్ లో వాడు కోడానికి తప్ప ఆ విలేజెస్ కోసం మీరేం పీకినట్లు ?అసలు అలాంటి విలేజెస్ ఉన్నట్లు అక్కడి గవర్నమెంట్ కి తెలీదా?

తెలిసే ఉంటుంది

తెలిసినా వాళ్ళెందుకు సహాయక టీమ్ లను పంపలేదు?

ఎట్లా పంపుతారు? మధ్యలో రోడ్లు డామేజ్ అయ్యాయ్ కదా

మరి మీ కెందుకా దురద? కావాలని అక్కడి ప్రభుత్వం మీద బురద జల్లాలని  కాకపొతే హెలికాప్టర్స్ ని దుర్వినియోగం ఎందుకు చేసినట్లు?

మేము ఎక్కడున్నా ఇలాగే ప్రభుత్వ మెషినరీని వాడుకోవటం అలవాటు.ఎందుకంటే అది మీడియా జన్మహక్కు-  

మరి ప్రపంచం లోని మిగతా ఏ చానల్సూ మీ లాగా నీచంగా ఎందుకు ప్రవర్తించటం లేదు-

వాళ్ళు మాకంటే చాలా వెనుకబడి ఉన్నారేమో

అంటే వాళ్ళు బాగా సెన్సిటివ్ అన్నమాట

సెన్సిటివిటీ అంటే  ఏమిటి? 
      
యర్రం శెట్టి సాయి