సమంత టు రకుల్

సమంతకు ఓ అలవాటు వుంది. ఫంక్షన్ అంటే చాలు చాలా ప్రత్యేకంగా తయారై వస్తుంది. అందుకోసం డిజైనర్ చేత ప్రత్యేకంగా ముందే తయారుచేయించుకున్న డ్రెస్ ధరిస్తుంది. దాంతో చూపులన్నీ ఆమె చుట్టూనే చక్కర్లుకొడతాయి. ఇప్పుడు…

సమంతకు ఓ అలవాటు వుంది. ఫంక్షన్ అంటే చాలు చాలా ప్రత్యేకంగా తయారై వస్తుంది. అందుకోసం డిజైనర్ చేత ప్రత్యేకంగా ముందే తయారుచేయించుకున్న డ్రెస్ ధరిస్తుంది. దాంతో చూపులన్నీ ఆమె చుట్టూనే చక్కర్లుకొడతాయి. ఇప్పుడు అదే స్టయిల్ ను అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్. 

టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ రకుల్ నే అన్న సంగతి ఎప్పుడో ప్రూవ్ అయిపోయింది. అలా ప్రూవ్ అయ్యేవరకు లోప్రొఫైల్ మెయింటెయిన్ చేసిన రకుల్ ఇటీవల మారింది. ఫంక్షన్ లకు అదిరిపోయే డ్రెస్ లతో వస్తోంది. మొన్నటికి మెున్నపండగ చేస్కో సినిమాకు 70వేలతో తయారుచేయించిన గౌన్ ధరించి, జనాల దృష్టిని తన వైపు మళ్లించింది. 

నిన్నిటికి నిన్న కిక్ 2 ఫంక్షన్ కు ప్రఖ్యాత డిజైనర్ రీతూకుమార్ డిజైన్ చేసిన మాంచి శారీ కట్టుకువచ్చి, ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇదంతా గతంలో సమంత చేసినదే. డిటో..ఇప్పుడు రకుల్ చేస్తోంది,. మరి సమంతను దాదాపు రీప్లేస్ చేసిందిగా టాలీవుడ్ లో.