సూపర్ స్టార్ మహేష్ కు బోలెడు కోపం వచ్చింది. ఎవరి మీద..బాహుబలి యూనిట్ మీద. ఈ మేరకు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని కథా కమామిషు ఇలా వుంది,. మే నెలలో బాహుబలి విడుదలవుతుందని మొదట్నించీ చెబుతున్నారు. దాంతో మహేష్ తాను కొరటాల శివ డైరక్షన్ లో చేస్తున్న సినిమాను ఓ నెల గ్యాప్ లో జూలైలో తెద్దామని ఫిక్సయ్యాడు.
ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు, కనీసం నాలుగైదు వారాలు థియేటర్లలో వుండాల్సిన సినిమాలు. అందుకే. అయితే, వున్నట్లుండి రాజమౌళి తన సినిమా డేట్ ను జూలై 17 అని ప్రకటించేసాడు. సరిగ్గా, దీంతోనే మహేష్ బాబకు మండింది అని వినికిడి. అదే ముందే అలా చెప్పి వుంటే తన సినిమాను మే వేళకు రెడీ చేసుకునేవాడు. ఇప్పుడు ప్రెస్టీజ్ క్వశ్చన్. తప్పని సరిగా వెనుక ముందు లాడకుండా జూలైలో వెళ్లాల్సిందే.
సరే, ప్రెస్టీజ్ సంగతి సరే, దాని వల్ల ఇరు సినిమాలకు ఇబ్బందే కదా. బయ్యర్లు ఈ రెండు సినిమాలను బోలెడు డబ్బులు పోసి కొంటారు. ఎందుకంటే సోలోగా వస్తారు..కలెక్షన్లు కుమ్మేస్తాయి, అని. మరి ఇప్పుడు రెండు సినిమాలు పోటీపడితే, రెండిటికీ అంతో ఇంతో నష్టమే. మరి ఎవరు వెనక్కు తగ్గుతారో చూడాలి.