Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మూడో ‘కిక్‌’కి సై.. అంటున్న రవితేజ

మూడో ‘కిక్‌’కి సై.. అంటున్న రవితేజ

ఓ సినిమా సక్సెస్‌ అయితే దానికి సీక్వెల్‌ తీయడానికి ఎంత సరదా పడ్తారో, ఆ సరదా వెనుక పెద్ద టెన్షన్‌ కూడా వుంటుంది. హిట్‌ సినిమాకి సీక్వెల్‌ తీసి తేడా కొడితే అది పరాభవంగానే భావించాల్సి వుంటుంది. అందుకే, సూపర్‌ హిట్‌ సినిమాలకి అన్ని వేళలా సీక్వెల్స్‌ అనే ఆలోచన చేయరు. పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా ‘సీక్వెల్‌’ అనే మాట వచ్చిన సందర్భాలే ఎక్కువ తప్ప, అరుదుగానే సీక్వెల్స్‌ తెరకెక్కుతుంటాయి.

అసలు విషయానికొస్తే, రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్‌గా ‘కిక్‌’ సినిమా వచ్చి ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఆ సబ్జెక్ట్‌కి సీక్వెల్‌ తీసేందుకు వీలుగానే తొలి సినిమాని ఎండ్‌ చేశాడు దర్శకుడు. చాన్నాళ్ళ తర్వాత దానికి సీక్వెల్‌ వస్తోందిప్పుడు. ‘కిక్‌-2’ ఆడియో లాంఛ్‌ తాజాగా జరిగింది. ఇది డబుల్‌ కిక్‌ ఇస్తుందని చిత్ర దర్శకుడు సురేందర్‌రెడ్డి, హీరో రవితేజ, నిర్మాత కళ్యాణ్‌రామ్‌ ధీమా వ్యక్తం చేశారు.

కాగా, ‘కిక్‌’ని మించిన ఘనవిజయం ‘కిక్‌-2’ సాధిస్తుందనీ, ‘కిక్‌-2’ బాగా ఆడితే ‘కిక్‌-3’ కూడా చేస్తానని హీరో రవితేజ చెప్పుకొచ్చాడు. దర్శకుడు సురేందర్‌రెడ్డి మాత్రం, ఈ సినిమా తనకు పెద్ద పాఠమనీ, ఇలాంటి సినిమా మళ్ళీ చేస్తానో లేదో తెలియదనీ అనడం చూస్తోంటే, ‘కిక్‌’ సిరీస్‌ ‘2’తో ఆగిపోయే అవకాశాలే ఎక్కువ. సినిమాకి బడ్జెట్‌ చాలా ఎక్కువైందన్న అభిప్రాయం దర్శకుడి మాటల్లో కనిపించింది. రవితేజ మాత్రం, ఇంకో సీక్వెల్‌ అంటుండడం ఆశ్చర్యకరమే.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?