జిమ్ జిమ్ అమెరికా అంటున్న నిఖిల్

కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్ సినిమా తరువాత కాస్త రెస్ట్ తీసుకుందామని అమెరికా వెళ్లాడు నిఖిల్. కానీ అక్కడ ఇప్పుడు వీర బిజీ అయిపోయాడు. రోజులో అధిక భాగం జిమ్ లో గడుపుతున్నాడు. సిక్స్…

కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్ సినిమా తరువాత కాస్త రెస్ట్ తీసుకుందామని అమెరికా వెళ్లాడు నిఖిల్. కానీ అక్కడ ఇప్పుడు వీర బిజీ అయిపోయాడు. రోజులో అధిక భాగం జిమ్ లో గడుపుతున్నాడు. సిక్స్ ప్యాక్ అని కాదు కానీ, మంచి ఫిజిక్ బల్డ్ చేయాలని మాంచి ట్రయినర్ల శిక్షణలో జిమ్ చేస్తున్నాడట. 

ఇక జిమ్ కాగానే అడ్వాన్స్ డ్ ఆక్టింగ్ శిక్షణ స్కూలుకు పరుగెత్తుతున్నాడట. ఆ కోర్సు తనకు చాలా ఉపయోగంగా వుందంటున్నాడు. ఈ కోర్సు ఈ నెలాఖరుతో అయిపోతుంది. అక్కడి నుంచి రాగానే కోన వెంకట్ శంకరాభరణం మొదలవుతుంది. ఎలాగైనా ఈ ఏడాది మరో సినిమా అందివ్వాలని నిఖిల్ అనుకుంటున్నాడు. 

శంకరాభరణం సెకండాఫ్ ను కోన వెంకట్ తన స్టయిల్ లో చాలా బాగా తయారు చేసాడట. నిఖల్ ఊ కొట్టిని యూనిట్ లు రెండు మూడు రెడీగానే వున్నాయి. కానీ సబ్జెక్ట్ లు, డైరక్టర్లు ఫైనల్ కావాలి. మూడు వైవిధ్యమైన సినిమాల అనంతరం ప్రేక్షకులు తన సినిమా పై ఓ అంచనాతో వచ్చే అవకాశం వుంది కాబట్టి, దాన్ని మీట్ అయ్యే సబ్జెక్ట్ ల కోసం వెదుకుతున్నాడట.