బోయ‌పాటి కూడా త‌లొంచాడు

మెగా హీరోల‌తో సినిమా అంటే ద‌ర్శకుల‌కు త‌ల‌నొప్పి వ్యవ‌హార‌మే. స్టార్ తో సినిమా తీస్తే ఎంత క్రేజో… అంత రిస్కు. అందునా మెగా హీరోల వ్యవ‌హారం ఏ రేంజులో ఉంటుంది. ద‌ర్శకుడు రాసుకొన్న క‌థ…

మెగా హీరోల‌తో సినిమా అంటే ద‌ర్శకుల‌కు త‌ల‌నొప్పి వ్యవ‌హార‌మే. స్టార్ తో సినిమా తీస్తే ఎంత క్రేజో… అంత రిస్కు. అందునా మెగా హీరోల వ్యవ‌హారం ఏ రేంజులో ఉంటుంది. ద‌ర్శకుడు రాసుకొన్న క‌థ క‌థ‌గా తెర‌పైకెక్కదు. మ‌ధ్యలో స‌వాల‌క్ష స‌ర్దుబాట్లు.  అవెలా ఉంటాయో… బోయ‌పాటి శ్రీ‌నుకి ఇప్పుడిప్పుడే అర్థమ‌వుతోంది. 

లెజెండ్‌తో హిట్టిచ్చి ఊపుమీదున్నాడు బోయ‌పాటి. త‌న కెరీర్‌లో తొలిసారి మెగా హీరోతో జ‌ట్టు క‌డుతున్నాడు. అల్లు అర్జున్ – బోయ‌పాటి సినిమా క‌న్‌ఫామ్ అయ్యింది. అడ్వాన్సులు ఇచ్చిపుచ్చుకోవ‌డం అయ్యింది. స్ర్కిప్టుపై మెగా కాంపౌండ్‌స్టాంప్ వేసేసింది. ఇక సెట్స్‌పైకి వెళ్లడ‌మే త‌రువాయి. అయితే ఈలోగా బోయ‌పాటి క‌థ‌లో అనేక మార్పులు చేర్పులు జ‌రిగాయ‌ట‌. 

బోయపాటి సినిమాల్లో ఎమెష‌న్ పీక్స్ లో ఉంటుంది. క‌థానాయ‌కుడు క‌త్తో, గొడ్డలో ప‌ట్టుకొని శ‌త్రువుల్ని వేటాడ‌డం భారీ స్థాయిలో చూపిస్తారు. అంత ఎమోష‌న్ బ‌న్నీకి న‌ప్పద‌ని మెగా కాంపౌండ్ భ‌య‌ప‌డింది. అందుకే యాక్షన్ మోతాదు త‌గ్గించాల‌ని సూచించార‌ట‌. 

దానికి తోడు బోయ‌పాటి కామెడీలో కాస్త వీక్‌. త‌న సూప‌ర్ హిట్ సినిమాల్లో కామెడీ అంతంత‌మాత్రమే.  ఆ విష‌యంలోనూ దృష్టి పెట్టాల‌ని బోయ‌పాటికి సూచించార‌ట‌. క‌థ‌లో అటు బ‌న్నీ, ఇటు అర‌వింద్‌.. కొన్ని మార్పులు సూచించిన‌ట్టు తెలుస్తోంది. సాధార‌ణంగా త‌న స్ర్కిప్టు విష‌యంలో ప‌క్కాగా ఉండే బోయ‌పాటి…. బ‌న్నీ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా స్ర్కిప్టులో మార్పులు చేసిన‌ట్టు తెలుస్తోంది. 

త్రివిక్రమ్ సినిమా పూర్తవ్వగానే ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కబోతోంది. మ‌రి ఈ సినిమాతో బోయ‌పాటిలోని కొత్త ఫ్లేవ‌ర్ ఏమైనా బ‌య‌ట‌కు వ‌స్తుందేమో చూడాలి.