కొంతమంది దర్శకులు ఎవరి మాటా వినరు. తాము తీసిందే వేదం అనుకొంటారు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ కూడా అలానే ఉండేవాడు. కథ తనదే, మాటలూ తానే రాసుకొంటాడు. ఇక హిట్టు సినిమా డైరెక్టర్. ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. అయితే టెంపర్ విషయంలో మాత్రం పూరి చాలా మారాడు.
తొలిసారి మరో రచయిత కథని ఎన్టీఆర్ కోసం తీసుకొన్నాడు. అడుగడుగునా.. బడ్జెట్ తగ్గించడానికి ప్రయత్నించాడు. అంతేనా… చివర్లో ఈ సినిమాకి బయటివాళ్లు `కత్తిరింపులు` చెప్పినా తలొగ్గాడు. ఆఖరికి బండ్ల గణేష్ అభిప్రాయాలకూ విలువ ఇచ్చాడు. ఈ సినిమా బయటపడడానికి ఒకానొక కారణం.. పీవీపీ ప్రసాద్. ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సహాయపడ్డారు. ఆయన టెంపర్ చూసి కొన్ని మార్పులు చెప్పారట.
గణేష్ కూడా టెంపర్ పై తనకున్న అనుమానాల్ని ఓ కాగితంపై రాసి పూరికి ఇచ్చాడట. ఇది వరకైతే.. పూరి ఆ కాగితాన్ని చెత్త బుట్టలో పడేసేవాడేమో. కానీ.. ఈసారి మాత్రం వాటికి విలువ ఇచ్చాడు. గణేష్ ఆలోచనలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేశాడు. టెంపర్ సినిమా అభిమానులకు నచ్చేలా రావడానికి ఈ మార్పులూ ఒకవిధంగా కారణభూతమయ్యాయి. పూరి మారాడు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి??