‘గ‌డ్డం’ అడ్డం ప‌డుతోంది!

గ‌డ్డం గ్యాంగ్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకొన్నాడు రాజ‌శేఖ‌ర్‌. ఈసినిమాతో త‌న కెరీర్ మ‌లుపు తిరుగుతుంద‌ని, హీరోగా మ‌రిన్ని ఛాన్సులు వ‌స్తాయ‌ని, ఈ సినిమాతో మ‌ళ్లీ తేరుకోవ‌డం ఖాయ‌మ‌ని.. న‌మ్మకంగా ఉండేవాడు. అయితే ఆ…

గ‌డ్డం గ్యాంగ్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకొన్నాడు రాజ‌శేఖ‌ర్‌. ఈసినిమాతో త‌న కెరీర్ మ‌లుపు తిరుగుతుంద‌ని, హీరోగా మ‌రిన్ని ఛాన్సులు వ‌స్తాయ‌ని, ఈ సినిమాతో మ‌ళ్లీ తేరుకోవ‌డం ఖాయ‌మ‌ని.. న‌మ్మకంగా ఉండేవాడు. అయితే ఆ సినిమా వ‌చ్చింది.. వ‌చ్చిన దారినే వెళ్లింది. రాజ‌శేఖ‌ర్ ఫ్లాపుల లిస్టులో చేరిపోయింది. 

ఈసినిమా అయినా ఆదుకొంటుంది అనుకొంటే.. ఇది వ‌ర‌క‌టి సినిమాల‌కంటే భారీ న‌ష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా ప్రభావం రాజ‌శేఖ‌ర్ కెరీర‌ఫై విప‌రీతంగా ప‌డే అవ‌కాశం ఉంది. ఎందుకంటే.. రాజ‌శేఖ‌ర్ సినిమాలు రెండు,మూడు పూర్తయినా విడుద‌ల‌కాలేదు. గ‌డ్డం గ్యాంగ్ సినిమా కాస్తో కూస్తో ఆడితే.. ఆయా సినిమాల్ని విడుద‌ల చేసుకోవాల‌ని భావించారు. 

అయితే అవ‌కాశం కూడా లేకుండా పోయింది. అర్జున, ప‌ట్టప‌గ‌లు, 100కి 100 సినిమాల ప‌రిస్థితి ఇప్పుడు అగ‌మ్యగోచ‌రంగా త‌యారైంది. హీరో… అనే బిల్డప్పులు ప‌క్కన పెట్టి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు వేషాలు ఒప్పుకొంటే మంచిదేమో..???  అలాగైనా పోయిన ఇమేజ్ ని తిరిగి రాబ‌ట్టుకోవ‌చ్చు.