సూర్యుడి స్టయిల్ లోనే సూర్య

సూర్యుడి కి లింక్ పెట్టి అల్లకున్న వైవిధ్యమైన కథతో తెరకెక్కుతోంది సూర్య వెర్సస్ సూర్య.  దీని వ్యవహారం కూడా సూర్యుడిలాగే వుంది. మెల మెల్లగా ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. ప్రారంభించినపుడు ఎవరికీ తెలియదు. సినిమా…

సూర్యుడి కి లింక్ పెట్టి అల్లకున్న వైవిధ్యమైన కథతో తెరకెక్కుతోంది సూర్య వెర్సస్ సూర్య.  దీని వ్యవహారం కూడా సూర్యుడిలాగే వుంది. మెల మెల్లగా ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. ప్రారంభించినపుడు ఎవరికీ తెలియదు. సినిమా పూర్తి కావస్తుండగా కాన్సెప్ట్ బయటకు వచ్చింది. 

జనం అరే..ఇదేదో బాగుందే అనుకుంటుంటే టీజర్ బయటకు వచ్చింది. భలే వుందే అనుకుంటుంటే..ఇప్పుడు మరో సాంగ్ ట్రయిలర్, రెగ్యులర్ ట్రయిలర్ లు బయటకు వచ్చాయి. సినిమాలో వైవిధ్యం కొట్టొచ్చినట్లు వీటి ద్వారా తెలుస్తోంది. తనికెళ్ల భరణికి మరో మాంచి డిఫరెంట్ క్యారెక్టర్ దొరికినట్లుంది. కాస్త మందేసి, చిందేసారు కూడా. 

ఇవి కూడా జనాల్లోకి వెళితే సూర్యకు మాంచి హైప్ వచ్చేటట్లే వుంది. ఇప్పటికే సినిమా బిజినెస్ మొత్తం పూర్తయింది. కార్తికేయ నిఖిల్ కు తెచ్చిన క్రేజ్ పుణ్యమా అని ఈ ప్రాజెక్ట్..అంతకు అంతా టేబుల్ ప్రాఫిట్ సంపాదించేసింది. ఇది కూడా హిట్ అయితే బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్ లు ఇచ్చిన హీరో అయిపోతాడు నిఖిల్.