చిన్ని వేషాలనుండి నేడు నిర్మాతగా

సినిమా రంగంలో కష్టపడితే ఎప్పుడో ఒక రోజు ఫలితం విజయవంతం అవుతుంది.. అని చెప్పడానికి ఉదాహరణగా కమెడియన్‌ ధన్‌రాజ్‌ని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా, డాన్స్‌ ట్రూప్‌లో సహాయకుఇగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న దన్‌రాజ్‌ ఇప్పుడు…

సినిమా రంగంలో కష్టపడితే ఎప్పుడో ఒక రోజు ఫలితం విజయవంతం అవుతుంది.. అని చెప్పడానికి ఉదాహరణగా కమెడియన్‌ ధన్‌రాజ్‌ని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా, డాన్స్‌ ట్రూప్‌లో సహాయకుఇగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న దన్‌రాజ్‌ ఇప్పుడు నిర్మాతగానూ మారిపోయానంటున్నాడు. 

జబర్‌దస్త్‌ ప్రోగ్రామ్‌లో ప్రత్యేకమయిన గుర్తింపు వున్న ధన్‌రాజ్‌, తాగుబోతు రమేష్‌ హీరోలుగా ఒక సినిమా గతంలో వచ్చింది. ఇప్పుడు నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’గా వస్తుంది. సినిమాకు ప్లాట్‌ఫామ్‌ ఇచ్చింది. ఇక్కడ సంపాదించినది ఇక్కడే ఖర్చుపెడితే ఇంకొంతమందికి ప్రయోజనం కలుగుతుంది. నేను కోట్లు పెట్టే నిర్మాతను కాదుగానీ నమ్మకం కుదిరితే నా శాయశక్తులా ఖర్చుపెట్టే నిర్మాతని.. అంటున్న ధన్‌రాజ్‌ రేపు దిల్‌ రాజు అవుతడేమో.. ఎవరు చెప్పగలరు.?