మనంతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చైతన్య ఈ నెలాఖరుకి ‘ఆటోనగర్ సూర్య’తో మళ్లీ మన ముందుకి రాబోతున్నాడు. తన గత రెండు చిత్రాల్లోను ఇతరుల సహకారంతో సక్సెస్ అయిపోయిన చైతన్యకి ఈసారి అసలు పరీక్ష ఎదురు కానుంది. తడాఖాలో సునీల్, మనంలో నాగార్జున, ఏఎన్నార్ ఉండడం వల్ల చైతన్య పని తగ్గిపోయింది.
కానీ ఆటోనగర్ సూర్యకి అన్నీ తనే. టైటిల్ రోల్ చేసిన చైతన్య ఇందులో మాస్ జోనర్ని మరోసారి టచ్ చేసాడు. ఈ జోనర్లో ఇంతవరకు చైతన్య సక్సెస్ కాలేకపోయాడు. అతని లాస్ట్ మాస్ మూవీ బెజవాడ అయితే దారుణంగా ఫ్లాపయింది. ఒక హీరో రియల్ స్టామినా తెలియజేసేది ఇలాంటి సినిమాలే కాబట్టి ఇదే చైతన్యకి అసలైన పరీక్ష.
అతను సోలోగా ఆటోనగర్ సూర్యని సక్సెస్ తీరం చేరుస్తాడా లేదా అని అభిమానులు ఉత్కంఠగా చూస్తున్నారు. అసలే విడుదలకి నానా తంటాలు పడిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాల్సిన అవసరముంది. మరి చైతన్య ఈ ఆటోని ఎందాకా నడపగలడో చూడాలిక.