మహేష్‌బాబు సినిమాతో పోటీగా రామ్ చరణ్ సినిమా రిలీజ్ కావడం ఆనవాయితీ అయిపోతోంది. నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకేసారి విడుదల కావడం.. తర్వాత 1 నేనొక్కడినే, ఎవడు రెండు రోజుల వ్యవధిలో రావడం కాకతాళీయం అనుకున్నా కానీ మరోసారి ఈ ఇద్దరి సినిమాలు ఒకే సీజన్లో రాబోవడం మాత్రం జస్ట్ కోయిన్సిడెన్స్ అనిపించట్లేదు.
ఆగడు విడుదలైన వారం రోజుల్లో గోవిందుడు అందరివాడేలే విడుదల కానుంది. దీంతో దసరా సెలవుల అడ్వాంటేజ్‌ని క్యాష్ చేసుకోవాలని చూస్తోన్న ఆగడుకి గోవిందుడు అడ్డు తగిలే అవకాశముంది. మహేష్‌తో రెండుసార్లు పోటీ పడిన చరణ్ రెండుసార్లూ లాభ పడ్డాడు. నాయక్ తర్వాత వచ్చిన సీతమ్మ వాకిట్లో కూడా విజయం సాధించింది కానీ ఈ ఇద్దరి క్లాష్‌లో రెండోసారి మహేష్ ఫెయిలయ్యాడు.
అయితే ఆగడుకి గోవిందుడు చెక్ పెట్టడం కష్టమని అనిపిస్తోంది. ఫామ్‌లో లేని కృష్ణవంశీ తీస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. శ్రీను వైట్ల మార్కు మాస్ ఎంటర్టైనర్ని ఎంతవరకు నిలువరిస్తుందనేది చూడాలి. ఇంతకుముందు దూకుడుకి ఎదురెళ్లిన ఊసరవెల్లి పరాజయం పాలయింది. ఆగడు కూడా దూకుడు రేంజ్ సక్సెస్ కాగలదని అంచనాలున్నాయి కనుక గోవిందుడిపై పెద్ద భారమే ఉంది.