దూషనే.. భౌతిక దాడి కాదు.!

‘నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.. చెయ్యిచేసుకున్నాడు..’ అంటూ పోలీసులకు బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా ఫిర్యాదు చేసిందంటూ నిన్న మొన్నటిదాకా వార్తలొచ్చాయి. ఒకప్పుడు ప్రీతి జింటాకి నెస్‌ వాడియా ‘ప్రియుడు’. ఇద్దరూ పెళ్ళిపీటలెక్కాలనుకున్నారు.. కానీ…

‘నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.. చెయ్యిచేసుకున్నాడు..’ అంటూ పోలీసులకు బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా ఫిర్యాదు చేసిందంటూ నిన్న మొన్నటిదాకా వార్తలొచ్చాయి. ఒకప్పుడు ప్రీతి జింటాకి నెస్‌ వాడియా ‘ప్రియుడు’. ఇద్దరూ పెళ్ళిపీటలెక్కాలనుకున్నారు.. కానీ అది కుదరలేదు. ఏమయ్యిందో, ఏం వివాదం తలెత్తిందోగానీ, ఇద్దరూ ఇప్పుడు ఒకర్ని ఒకరు శతృవులుగా భావిస్తున్నారు.

ఇక, ప్రీతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రీతి తరఫు లాయర్‌ చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రీతి జింటా తనను నెస్‌ వాడియా దూషించాడని మాత్రమే ఫిర్యాదు చేసిందన్నది ఆమె తరఫు లాయర్‌ చెబుతున్న మాట. అంటే మిగతాదంతా మీడియా ఊహించేసుకుందని అనుకోవాలా.?

మీడియా ఊహించుకోవడం కాదు, ప్రీతి జింటాకి మద్దతుగా ఆందోళనలు చేపట్టిన మహిళా సంఘాలు, ఓ అడుగు ముందుకేసి, నెస్‌ వాడియాపై దుమ్మెత్తిపోశాయి. పురుషాహంకారమనీ, ఇంకోటనీ.. రాద్ధాంతం చేయడంతో, ఇంకేముంది.. లైంగికంగా ప్రీతి జింటాని నెస్‌ వాడియా వేధించాడేమోననే గాసిప్స్‌ షురూ అయ్యాయి. కాగా, ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా నెస్‌ వాడియా తనపై చెయ్యి చేసుకున్నాడనేది ప్రీతి చేసిన ఆరోపణగా తొలుత వార్తలొచ్చాయి. అప్పుడే ప్రీతి ఖండన ప్రకటన చేసి వుంటే పరిస్థితి ‘లైంగిక వేధింపులు’ అనే గాసిప్స్‌ దాకా వచ్చేది కాదేమో.!