Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈసారి బ్లాక్‌బస్టర్‌ గ్యారెంటీ

ఈసారి బ్లాక్‌బస్టర్‌ గ్యారెంటీ

బాలీవుడ్‌లో జెండా పాతేయాలని వెళ్లిన తమన్నాకి ‘హిమ్మత్‌వాలా’తో దిమ్మ తిరిగే రిజల్ట్‌ వచ్చింది. ఆ సినిమా దారుణంగా ఫ్లాప్‌ అయిపోవడంతో తమన్నా కోరుకున్న డ్రీమ్‌ స్టార్ట్‌ దక్కకుండా పోయింది. అయినప్పటికీ హమ్‌షకల్స్‌, ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాల్లో అవకాశం దక్కించుకున్న తమన్నా ఈసారి టార్గెట్‌ మిస్‌ కాదని అంటోంది. 

హిమ్మత్‌వాలా మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని, అలాంటివి ఒక్కోసారి మిస్‌ ఫైర్‌ అయ్యే అవకాశముందని.. కానీ హమ్‌షకల్స్‌ మాత్రం పూర్తిస్థాయి కామెడీ చిత్రమని, దీనిని తప్పకుండా ఆదరిస్తారని అంటోంది. హిమ్మత్‌వాలాతో హిట్‌ కొట్టలేకపోయినా ఈసారి మాత్రం బ్లాక్‌బస్టర్‌ గ్యారెంటీ అని చెప్తోంది. కానీ సైఫ్‌, రామ్‌ కపూర్‌, రితేష్‌ ఆడ వేషాలు వేసుకుని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని పబ్లిక్‌ టాక్‌. 

హమ్‌ షకల్స్‌తో పాటు ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై కూడా తమన్నా ధీమాగా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్‌లో తానొక స్టార్‌ అయిపోతానని ఆమె ఆశిస్తోంది. ఒకవేళ తమన్నా కోరుకున్నట్టు అక్కడ క్లిక్‌ కాకపోయినా ఆమెకి సౌత్‌లో ఉన్న డిమాండ్‌ అయితే ఇప్పట్లో తగ్గదు కనుక రిజల్ట్‌ తేడా అయినా పెద్ద బాధ పడాల్సిన పని లేదేమో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?