పవన్‌కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్ 2’ కథ మళ్లీ మొదటికి వచ్చిందని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడిగా సంపత్ నందిని ఖరారు చేసి గత రెండేళ్లుగా అతడిని దీని మీదే కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకో పవన్‌కి అతనిపై గురి కుదిరినట్టు లేదు. అందుకే కథ పకడ్బందీగా రెడీ అయినా కానీ షూటింగ్ మొదలు పెట్టకుండా లేట్ చేస్తూ వచ్చాడు.
గోపాల గోపాల షూటింగ్ పూర్తి చేసిన తర్వాత గబ్బర్‌సింగ్ 2 స్టార్ట్ చేసేస్తాడని అనుకుంటున్నారు. దర్శకుడిగా ఎవరైతే బాగుంటారనే చర్చ రావడం, తన సన్నిహితుల సలహాలు తీసుకోవడం… వారిలో కొందరు ‘పవర్’ డైరెక్టర్ బాబీకి ఓటేయడం జరిగిందట. పవర్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ని, యాక్షన్‌ని బాగా మిక్స్ చేసిన బాబీ వర్క్ పవన్‌కి నచ్చిందట.
గబ్బర్‌సింగ్ 2 కూడా పోలీస్ కథ కావడంతో అతడైతే బాగా హ్యాండిల్ చేస్తాడని భావిస్తున్నాడని, అయితే ఇంకా బాబీ పేరు ఖరారు కాలేదని తెలిసింది. అదే జరిగితే సంపత్ నంది ఏం చేస్తాడో, ఎలా రియాక్ట్ అవుతాడో మరి.