ఇటీవల సోషల్ నెట్ వర్క్ లో ఓ మాంచి వీడియో సర్క్యులేట్ అవుతోంది. అదేమిటంటంటే..అబ్బాయిలను చిన్నప్పటి నుంచి, 'మగపిల్లడి..లేదా మగకుర్రాడివి..కాదూ అంటే మగాడివి..ఏడవచ్చా' అంటూ వస్తున్నారు. అంతే కానీ , మగాడివి..ఆడపిల్లని ఏడపించకూడదు అని నేర్పరెందుకుని..అంటూ ప్రశ్నిస్తుంది మాదురీ దీక్షిత్. స్వఛ్ భారత వ్యవహారం అలాగే అనిపిస్తోంది.
రోడ్లను శుభ్రం చేస్తున్నారు సెలబ్రిటీలు..నాయకులు, వివిధ సంస్థలు. మంచిదే. కాదని అనలేం. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా..రోడ్లు పాడు చేయకండి, వీధులు పాడుచేయకండి అన్నది నేర్పాలి ముందు. స్వఛ్ భారత్ కాదు..సేవ్ భారత్. చెత్తనుంచి భారత్ ను కాపాడండి అని నేర్పాలి. మనం పోస్తే నేమి..ఎవరో ఒకరు క్లీన్ చేస్తారనుకునే అలవాటు నేర్పడం కన్నా, అసలు చెత్త పోయకూడదు అని నేర్పడం అవసరం అనిపిస్తోంది.
పైగా సెలబ్రిటీలు దీన్ని కూడా ఏదో గ్లామరస్ గా చేయాలనుకోవడం చిత్రంగా వుంది. నాగ్ లాంటి వాళ్లు దీనికోసం ప్రత్యేకంగా టీ షర్ట్ లు డిజైన్ చేయించి, గ్రూప్ గా తొడుక్కుని ఫోటోలు దిగడం ఏమిటి? అంటే టీషర్ట్ లు, వాటికి లోగోలు..ఇవన్నీ అవసరమా స్వఛ్ భారత్ కు.
ముందు కఠినమైన చట్టాలు కావాలి. ఇంటి ముందు చెత్త పోసినా, వీధులు పాడుచేసినా దండిస్తారన్న భయం కావాలి. అప్పుడు స్వఛ్ భారత్ లు అవసరం వుండదు. అలాకాకుండా ఇలా తుడవడం అలవాటు చేస్తే, వాళ్లే పోయడం మానేస్తారనుకుంటే పొరపాటు. మన జనాలు దేశ ముదుర్లు, విదేశీ ముదుర్లునూ..కావాలంటే ఇప్పుడు స్వఛ్ భారత్ జరుగుతున్న ప్రాంతాలను చూడండి..చెత్త మళ్లీ రావడం లేదా? అసలు అదంతా ఎందుకు? నిత్యం మున్సిపాల్టీ సిబ్బంది ఇంతలా తుడుస్తున్నా, మళ్లీ 24గంటల్లో అంత చెత్త ఎందుకు వస్తోంది? వారు చేస్తున్నది స్వఛ్ భారత్ కాదా? వారికి సాధ్యం కానికి ,సెలబ్రిటీలు గంటా, అరగంటా తుడిస్తే వినేస్తారా? అందుకే అసలు ఎవరైనా చెప్పాల్సింది..చెత్త తుడవమని కాదు..చెత్త పోయవద్దని.