హోలీ పండగొస్తే ఒంటికి రంగులు పూసుకోవడం సహజం. కానీ, ఆ పేరు చెప్పి ఎక్స్పోజింగ్ చేయడం మాత్రం పూనమ్ పాండేకే చెల్లింది. క్రికెట్ అయినా, ఇంకోటైనా.. కాదేదీ పబ్లిసిటీ స్టంట్కి అనర్హం.. అన్న సిద్ధాంతా ఫాలో అవుతోన్న పూనమ్ పాండే, తన అంద చందాల్ని ఆరబోసేయడానికి ‘కారణాల్ని’ వెతుక్కోవడంలో తనను మించినవారెవరూ లేరని మరోమారు నిరూపించింది.
ఆ మధ్య ‘నో బ్రా డే’ అంటూ అందర్నీ విస్మయానికి గురిచేసింది ట్విట్టర్లో హాట్ హాట్ ఫొటో పెట్టి మరీ. తాజాగా పూనమ్ పాండే ‘సాకర్’ ఫీవర్తో ఊగిపోతోన్న అభిమానులకి తన హాట్ హాట్ ‘సాకర్ వీడియో’తో పెద్ద ట్రీట్ ఇచ్చింది. టూ పీస్ బికినీ వేసి మరీ చిందులేసింది ఆ వీడియోలో పూనమ్ పాండే.
ఇంకేముంది.. పూనమ్ అభిమానులు ఆమె అందాల విందులో మేగ్జిమమ్ ఎంజాయ్ చేసేస్తున్నారు. పూనమ్ పాండేనా మజాకానా.?