సల్మాన్‌ఖాన్ గత చిత్రంలో లేనిదీ… ఈసారి ఉన్నదీ ఏంటంటే ‘కిక్’ ట్రెయిలర్ చూసి చాలా విషయాలు చెప్పొచ్చు. సల్మాన్ గత చిత్రం జై హో చిత్రంలో క్వాలిటీ లేదు. అన్నిటికీ మించి డైరెక్టర్ లేడు. కానీ ఈసారి కిక్‌లో అన్నీ ఉన్నాయి. తమ్ముడిని దర్శకుడిగా నిలబెడదామని తనకు తానే వాత వేసుకున్న సల్మాన్‌ఖాన్ ఇప్పుడు తిరిగి ట్రాక్ ఎక్కేసాడు.
సాజిద్ నడియాడ్‌వాలా తీసిన ‘కిక్’ ట్రెయిలర్ ‘కిక్ యాస్’ అనిపిస్తోంది. సినిమా అంతటా గ్రాండియర్‌కి తోడు హీరోయిజం పుష్కలంగా ఉంది. సల్మాన్ వర్షన్ ఆఫ్ ధూమ్ అన్నట్టుగా ఉన్న కిక్ ఈద్‌కి రిలీజ్ అవుతోంది. ప్రతి ఈద్‌కీ బాలీవుడ్ నుంచో బ్లాక్‌బస్టర్ రాసేసుకోవచ్చు కాబట్టి ఈసారి భాయ్ ఖాతాలోనే అది వేసేసుకోవచ్చు.
అల్లాటప్పా సినిమాల్తోనే దాదాపు రెండొందల కోట్లు కొట్టేసిన హిస్టరీ ఉన్న సల్మాన్‌ఖాన్ ఈసారి ఎన్ని కోట్లు కొట్టబోతున్నాడు. రెండొందల మార్కుని అయితే గ్యారెంటీగా దాటిపోతాడని అంచనాలున్నాయి. దానిని.. చెన్నయ్ ఎక్స్‌ప్రెస్‌ని, ధూమ్ 3ని కూడా దాటేంత కిక్ ఈ సినిమాలో ఉందా? రెండొందల యాభై కోట్లు దాటి బాలీవుడ్‌కి మూడొందల కోట్ల లెక్క చూపించే తిక్క దీనికుందా? వెయిట్ అండ్ సీ.