అంగట్టో అన్నీ ఉన్నా అల్లుడి నోట్టో ఏదో అన్నట్టు.. శర్వానంద్‌కి అన్నీ ఉన్నాయ్. హీరోగా క్లిక్ అవడానికి అవసరమైన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడు. చక్కని రూపం, ఆకట్టుకునే స్వరం, అన్నిటికీ మించి ఏ పాత్రనైనా మెప్పించగల అభినయం.. ఇన్ని ఉన్నా కానీ అసలైనది లేదు పాపం. అదే అదృష్టం. అందుకే ఇంకా హీరోగా నిలదొక్కుకునేందుకు డక్కామొక్కీలు తింటున్నాడు.
తనతో సినిమాలు తీసే నిర్మాతలు తగ్గిపోవడంతో స్వయంగా సినిమా తీసి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అవకాశాలే లేని టైమ్‌లో అతనికి ‘మిర్చి’ నిర్మాతల నుంచి కబురొచ్చింది. అందరికీ బాగా నచ్చిన కథకి శర్వానంద్ అయితే బాగా సూట్ అవుతాడని వాళ్లకి అనిపిస్తే… కథ విని ఫ్లాట్ అయిపోయాడట శర్వా.
అందుకే ఈ చిత్రానికి పైసా పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా నటించాడట. హిట్టు కోసం ఫ్రీగా కూడా నటించేస్తున్న శర్వానంద్ శ్రమ వృధా పోదనే అనుకుందాం. అతను నటిస్తున్న ‘రన్ రాజా రన్’ కుంటుపడ్డ తన కెరీర్‌ని పరుగులు తీయిస్తుందనే ఆశిద్దాం. తన పేరులోని ఆనందం తనకి దక్కుతుందనే కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ శర్వానందం… ఊప్స్ అదేలే శర్వానంద్.. ఏదో ప్రాస కోసం `) !!