ఇంకెవరూ దొరకలేదా బండ్లన్నా?

ఎవరి గురించి మాట్లాడాలన్నా ముందుగా హై పిచ్‌లో ‘మనసున్న మనిషి… మానవత్వమున్న బ్లా బ్లా…’ అంటూ అందుకునే బండ్ల గణేష్‌ తను నిర్మిస్తున్న ‘నీ జతగా నేనుండాలి’ హీరో సచిన్‌ గురించి కూడా సేమ్‌…

ఎవరి గురించి మాట్లాడాలన్నా ముందుగా హై పిచ్‌లో ‘మనసున్న మనిషి… మానవత్వమున్న బ్లా బ్లా…’ అంటూ అందుకునే బండ్ల గణేష్‌ తను నిర్మిస్తున్న ‘నీ జతగా నేనుండాలి’ హీరో సచిన్‌ గురించి కూడా సేమ్‌ డబ్బా వాయించేస్తున్నాడు. ఆషికీ 2 రైట్స్‌ తీసుకుని దానిని తెలుగులో ఎవరితో రీమేక్‌ చేయాలా అని ఆలోచిస్తే తనకి తన స్నేహితుడు సచిన్‌ గుర్తొచ్చాడట!!!

అతడికి ఫోన్‌ చేసి ఇలా ఆషికీ 2 తెలుగులో చేద్దామని అడగ్గానే సచిన్‌ సారు ఓకే అన్నాడట. ఒక లవ్‌స్టోరీ తీయడానికి తెలుగులో ఇక ఏ హీరోలు లేనట్టు… ముంబయి నుంచి తెలుగు రాని సచిన్‌ని పిలిపించాలా? ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ పలకని అతడి కంటే హీరోలు మన తెలుగులో లేరా? చిన్న సినిమా చేయాలనుంటే ఆ స్లాట్‌లో తెలుగులో ఎంత మంది హీరోలు లేరని? 

ఇంతకీ విషయం ఏమిటంటే.. అసలు ఈ సినిమాకి నిర్మాత బండ్ల గణేష్‌ కాదట. సచిన్‌కే ఊసుపోక సినిమాలు చేస్తుంటాడు తన హీరోయిజం దుగ్ధ తీర్చుకోడానికి. అతను నిర్మాణ నిర్వహణ బాధ్యతలు తనకి అప్పగిస్తే ఈ సినిమాని గణేష్‌ తన సినిమాగానే మార్కెట్‌ చేస్తున్నాడట. ఎలాగో నిర్మాతగా తన పేరే ఉంది కాబట్టి పనిలో పనిగా పై విధంగా పులిహోర కలిపేసాడంట. బండ్లన్నా.. నువ్వు సూపరంతే!