కోమా నుంచి తేరుకుని ఇంటికి…

షూమాకర్‌.. ప్రపంచాన్ని ఊపేసిన ఫార్ములా వన్‌ డ్రైవర్‌ ఇతడు. గత ఏడాది స్కీయింగ్‌ చేస్తూ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోయిన షూమాకర్‌, ఆర్నెళ్ళపాటు కోమాలోనే వున్నాడు. ‘అసలు బతికే అవకాశమే చాలా తక్కువ..’ అని…

షూమాకర్‌.. ప్రపంచాన్ని ఊపేసిన ఫార్ములా వన్‌ డ్రైవర్‌ ఇతడు. గత ఏడాది స్కీయింగ్‌ చేస్తూ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోయిన షూమాకర్‌, ఆర్నెళ్ళపాటు కోమాలోనే వున్నాడు. ‘అసలు బతికే అవకాశమే చాలా తక్కువ..’ అని తొలుత ఆయన్ను పరిశీలించిన వైద్యులు తేల్చి చెప్పారు. కానీ, కోమాలోంచి అతనిప్పుడు కోలుకున్నాడు.. ఇంటికి కూడా వెళ్ళిపోయాడట. ఈ విషయాన్ని ఇంకా షూమాకర్‌ తరఫున అధికారికంగా ఎవరూ ప్రకటించలేదనుకోండి.. అది వేరే విషయం.

స్పోర్ట్స్‌ మీడియా సంస్థలకు అందిన సమాచారాన్ని బట్టి, షూమాకర్‌ కోలుకున్నప్పటికీ, దీర్ఘకాలం ఆయనకు వైద్య చికిత్స అవసరమని వైద్యులు స్పస్టం చేశారట డిశ్చార్చ్‌ చేస్తున్న సందర్భంలో. ఫార్ములా వన్‌ ప్రపంచంలో షూమాకర్‌ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. షూమాకర్‌ ప్రమాదానికి గురయ్యాడన్న వార్తతో మొత్తంగా ప్రపంచమే తల్లడిల్లిపోయిందనడం అతిశయోక్తి కాదేమో.

ఎలాగైతేనేం.. షూమాకర్‌ కోలుకున్నాడు. అయితే మళ్ళీ ఫార్ములా వన్‌ డ్రైవర్‌గా అతను కెరీర్‌ ప్రారంభించే అవకాశాలు ఇప్పటికైతే లేనట్టే. ‘బతుకుతాడో లేదో..’ అన్న అనుమానాలనుంచి, ‘ప్రాణగండం లేదు..’ అనే స్థాయికి వచ్చిన షూమాకర్‌, స్వతహాగా ధైర్యవంతుడు, మొండితనం కలవాడు కావడంతో.. ఏమో భవిష్యత్తులో పార్ములా వన్‌ డ్రైవర్‌గా తన ఉనికి చాటుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.