డెట్రాయిట్ తానా మహాసభల నిధుల సేకరణలో అద్భుత స్పందన

డెట్రాయిట్ మహానగరంలో జూలై 2-4, 2015 లో జరుగబోయే తానా మహాసభల కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ నాదెళ్ళ గంగాధర్ అద్వర్యంలో అక్టోబర్ 25న స్థానిక సెయింట్ తోమా హాలుయందు జరిగిన నిధులసేకరణ సమావేశంలో   తానా…

డెట్రాయిట్ మహానగరంలో జూలై 2-4, 2015 లో జరుగబోయే తానా మహాసభల కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ నాదెళ్ళ గంగాధర్ అద్వర్యంలో అక్టోబర్ 25న స్థానిక సెయింట్ తోమా హాలుయందు జరిగిన నిధులసేకరణ సమావేశంలో   తానా అభిమానులు కనీవినీ ఎరుగని రీతిలో స్పందించి 1.6 మిలియన్ డాలర్ల విరాళాలను అందించారు. 
ఇంతకూ మునుపెన్నడూ అమెరికాలో ఏ తెలుగు సంస్థ ఒక్కరోజులో సమీకరించినదానికన్నా ఈ మొత్తం దాదాపు మూడు రెట్లు ఎక్కువ. 600 మంది పైగా హాజరైన ఈ సమావేశం శ్రీమతి గద్దే పద్మజ జ్యోతి ప్రజ్వలనతో మొదలై చక్కని వినోదకార్యక్రమాలతో వైభవోపేతంగా జరిగింది. తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్, ఉపాధ్యక్షులు జంపాల చౌదరి, బోర్డు చైర్మన్ కొడాలి నరేన్, ఫౌండేషన్ ఛైర్మన్ తాళ్లూరి జయశేఖర్, గత అధ్యక్షులు కోమటి జయరాం, యడ్ల హేమప్రసాద్, ఫౌండేషన్ కార్యదర్శి గోగినేని శ్రీనివాసరావు, కోశాధికారులు తాతా మధు, మలిసెట్టి సాగర్, తానా నాయకులు  కొల్లా సుబ్బారావు, లావు అంజయ్య చౌదరి, యడ్లపాటి యుగంధర్, శృంగవరపు నిరంజన్, కోయ హరీష్, జరుగుల శ్రీనివాస్, వీరపనేని పూర్ణ, చిన్న వాసుదేవరెడ్డి, కానూరు హేమ, పెద్దిబోయిన జోగేశ్వరరావు, పొట్లూరిరవి, గుర్రం గౌతం, అడుసుమిల్లి రాజేష్, యలమంచిలి రావు తదితరులను తానా కార్యదర్శి వేమన సతీష్ సభికులకు పరిచయం చేశారు. 

తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్ మాట్లాడుతూ తానాకు డెట్రాయిట్ ప్రజానీకానికి ఉన్న గాఢమైన బంధాన్ని గుర్తు చేస్తూ మరోసారి సభలకు అతిధ్యమిస్తున్న డెట్రాయిట్ ప్రజలకు, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ తదితర సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా తానా సంస్థ ఫౌండేషన్, టీం స్క్వేర్ ద్వారా తెలుగు ప్రజలకు నిరంతరం చేస్తున్న సేవలను సభికుల హర్షద్వానాల మధ్య వివరించారు. సభకు అతిధులుగా  సీనియర్ శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర, సీపీఐ నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావులు కూడా హాజరయ్యారు.  తానా తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను, ప్రత్యేకించి హుదుద్ తూఫాన్ బాధితులకు చేసిన భారీ సహాయాన్ని ధూళిపాళ నరేంద్ర ప్రశంసించారు. ముప్పాళ్ళ నాగేశ్వరరావు కూడా తానా సేవలను గుర్తుచేసుకుంటూ సమావేశాలు జయప్రదం కావాలని కోరుకున్నారు.   

తదుపరి చాపలమడుగు ఉదయకుమార్ తనదైన శైలితో నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమం అద్యంతం ఆసక్తికరంగా సాగి సుమారు గంటన్నర వ్యవధిలో ఎన్నడూ ఉహించని రీతిలో 1.60 మిలియన్ డాలర్స్ పైగా సేకరించబడింది. ముఖ్య దాతలు కాట్రగడ్డ కృష్ణ ప్రసాద్ $100,000, పూర్వపు డెట్రాయిట్ పూర్వవాస్తవ్యులు పొట్లూరి వరప్రసాద్ $100,000, గద్దె దుర్గాప్రసాద్ $51,116, ప్రవాస ప్రముఖులు NT చౌదరి $50,000, గోనుగుంట్ల శ్రీనివాసన్ $25,000, నవీన్ యెర్నేని $25,000, కుకునూర్ వినోద్ $25,000తో పాటు అనేకమంది పెద్ద మొత్తాలలో విరాళాలిచ్చారు. ఇంతేకాక ఇతరప్రాంతాల నుంచి వచ్చిన తానా నాయకత్వం అక్కడికక్కడే $470,000 ప్రకటించి తమ సహకారాన్ని, విధేయతను చాటారు. ఇంత స్వల్పవ్యవధిలో రికార్డుస్థాయిలో నిధులు సమీకరించినందుకు కాన్ఫరెన్స్ కో-ఆర్డినేటర్ నాదెళ్ళ గంగాధర్ని అభినందించిన తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్ డెట్రాయిట్ తెలుగు సంస్థకు, నిధులిచ్చిన దాతలకు తన కృతజ్ఞతలు తెలిపారు. కెనడా నుంచి కాలిఫోర్నియా వరకూ ఉత్తర అమెరికా అన్ని మూలలనుంచి వచ్చి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంచేసిన తానా నాయకవర్గ సభ్యులందరికీ నన్నపనేని మోహన్ ధన్యవాదాలర్పించారు.  

కోఆర్డినేటర్ నాదెళ్ళ గంగాధర్ మాట్లాడుతూ ఉదారంగా స్పందించిన దాతలందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు తెలుపుతూ చక్కని చిరస్మరణీయమైన తానా కాన్ఫరెన్స్ నిర్వహణకై స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్స్  సహకారంతో పూర్తి కృషి చేస్తామని చెప్పారు. నిధుల సేకరణ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు పుట్టగుంట సురేష్, యెర్నేని నవీన్ దాతలకు ధన్యవాదాలను తెలిపారు. కాన్ఫరెన్స్ కార్యదర్శి గోగినేని శ్రీనివాసరావు అనేక ప్రాంతాలనుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన తానా నాయకులకు, సమావేశానికి విచ్చేసిన సభికులకు, వారు కనబరచిన ప్రేమాభిమానాలకు కృతఙ్ఞతలు చెప్పారు.  సమావేశం విజయవంతం కావడంలో ప్రాంగణాన్ని అలంకరించిన కోనేరు శ్రీవాణి, మారుపూడి జ్యోతి, ఆడియో సమకూర్చిన శ్రీనివాస రాజు , ఫోటోగ్రాఫికి సహకరించిన కోనేరు సునీల్, కోటి, కల్చరల్ కమిటీ గొంది మనోరమ,  ఆహార కమిటీ కొడాలి నరహరి, శివాజీ లతో పాటు చట్నీస్, నమస్తే, ఫ్లేవర్స్ రెస్టారెంట్లు ప్రముఖ పాత్ర వహించాయి. యువగాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవిలు తమ మధుర గీతాలతో, మిమిక్రీ రమేష్ తన హస్యచతురతతో సభికులను ఉర్రూతలూగిస్తూ పండుగ వాతావరణాన్ని కలిగించారు.

ఉదయం ఇండస్ బాంకెట్ హాలులో  జరిగిన తానా నాయకుల మరియు కాన్ఫరెన్స్ కమిటీ  నాయకుల పరస్పర పరిచయ కార్యక్రమం మంచి ఫలితాన్నిచ్చింది. కోఆర్డినేటర్ నాదెళ్ళ గంగాధర్ అనుభవజ్ఞులైన గత నాయకులను ఒక్కొక్కరినీ పరిచయం చేయగా ప్రస్తుత కమిటీ నాయకులు ఆసక్తితో వారి సలహా సూచలను విన్నారు. ముఖ్యంగా జంపాల చౌదరి, చిలుకూరి సతీష్, కోమటి జయరాం, బండ్ల హనుమయ్య, వెన్నం మురళి, కొండ్రకుంట చలపతి, తాళ్లూరి జయశేఖర్, నరేన్ కొడాలి, వేమన సతీష్ తదితరులు చర్చించారు.  తానా ప్రాంతీయ ప్రతినిధి పెద్దిబోయిన జోగేశ్వరరావు, డీ టి ఏ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సూరపరాజు వేణు, గోనుగుంట్ల శ్రీనివాసన్, ద్వారకా ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. వీరందరికీ కాన్ఫరెన్స్ కార్యదర్శి గోగినేని శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియచేస్తూ సమిష్టిగా పరస్పరసహకారంతో పనిచేస్తూ సభలను జయప్రదం చేస్తామన్నారు. తదుపరి అందరూ కలసి సమావేశాలు జరుగబోయే డెట్రాయిట్ నగరం లోని కోబో హాలు, క్రౌన్ ప్లాజా, మారియట్ హోటల్స్ దర్శించి సమావేశం ఏర్పాట్లు గురించి కూలంకషంగా చర్చించారు. ఈ పరస్పర పరిచయ కార్యక్రమం మంచి ఫలితాన్నిచ్చిందని, సభల నిర్వహణపై స్థైర్యాన్ని కలిగించిందని నన్నపనేని మోహన్,  నాదెళ్ళ గంగాధర్  సంతోషాన్ని వెలిబుచ్చారు. 

ఈ కార్యక్రమాలు, డేట్రాయిట్ తెలుగు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహన్ని నింపి, తానా 20వ మహాసభలపై అంచనాలను మరింతగా పెంచాయి.

Mohan Nannapaneni                                                                           Satish Vemana
 President, TANA                                                                               Secretary
Tel: (508) 612-6676                                                                            Tel:(703) 731-8367