‘మీడియా ఫ్రెండ్లీ’గా మారనున్న రాంచరణ్‌

హీరో రాంచరణ్‌ తాను చాలా పెద్ద సెలబ్రిటీని అని.. ఎంత ఎక్కువగా మీడియా వారితో మాట్లాడితే అంత సెలబ్రిటీ`షిప్‌ పలచన అయిపోతుందని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో మీడియా ఫోకస్‌ మాత్రం తన మీద…

హీరో రాంచరణ్‌ తాను చాలా పెద్ద సెలబ్రిటీని అని.. ఎంత ఎక్కువగా మీడియా వారితో మాట్లాడితే అంత సెలబ్రిటీ`షిప్‌ పలచన అయిపోతుందని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో మీడియా ఫోకస్‌ మాత్రం తన మీద ఉండాలని అందరిలాగే ఆశపడుతూ ఉంటాడు. పైగా మీడియామీట్‌లు పెట్టిన కొన్ని సందర్భాల్లోనూ వారితో దురుసుగా ప్రవర్తించిన ట్రాక్‌ రికార్డు రాంచరణ్‌కు ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాంచరణ్‌ మీడియాఫ్రెండ్లీగా మారిపోతున్నాడని.. ఇక మీదట మీడియాతో తరచూ ఇంటరాక్ట్‌ అవుతూ ఉంటాడని సంకేతాలు వస్తున్నాయి. 

నిజానికి రాంచరణ్‌ మీడియాతో వ్యవహరించే పెడసరం పోకడల కారణంగా.. ఆయన కెరీర్‌ సంగతి ఏమోగానీ సినిమాలకు` పర్యవసానంగా ఆయన ప్రొడ్యూసర్లకు చాలా నష్టం జరుగుతోంది. తాజాగా షూటింగ్‌లో ఉన్న ‘గోవిందుడు అందరి వాడేలే’ విషయాన్నే తీసుకుంటే.. ఆ సినిమా ఆగిపోయిందని, చిరంజీవి కి నచ్చక ఆపేయమన్నారని ఇలా రకరకరాల అబద్ధపు ప్రచారం జరిగింది. ఇలాంటి ప్రచారాలు సినిమా బిజినెస్‌ మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయన్నది నిజం. మీడియాలో ఫోకస్‌ మారుతుండడం గురించి చిరంజీవి హెచ్చరించారని ఆనేపథ్యంలోనే నిర్మాత బండ్ల గణేష్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ‘తమ చిత్రం ఆగిపోలేదని, షూటింగ్‌ రెగ్యులర్‌గా జరుగుతోందని, అవుట్‌పుట్‌ బాగా వస్తోందని’ సెలవివ్వడం జరిగింది.

దీని తర్వాత ఇక రాంచరణ్‌ కూడా రెగ్యులర్‌గా ప్రెస్‌మీట్‌లు పెడుతూ.. మీడియాతో ఫ్రెండ్లీ దృక్పథంతో వ్యవహరిస్తారని కూడా మెగా కోటరీనుంచి సంకేతాలు వస్తున్నాయి. మీడియా ప్రయారిటీ బాగా తెలిసిన చిరంజీవి.. వైఖరి మార్చుకోవాల్సిందిగా నచ్చజెప్పడం వల్లనే చెర్రీ.. ఇలా ఫ్రెండ్లీ నేచర్‌కు దగ్గరవుతున్నారని పలువురు అనుకుంటున్నారు.